Sunday, May 19, 2024
- Advertisement -

మాటలతో కాదు చేతలతోనే పాక్ కుసమాధానం ఇస్తాం: భారత ఆర్మీ

- Advertisement -

నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ సైన్యం మరోసారి దురాగతానికి తెగబడింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ భారత సైనికులపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నలుగురిని బలిగొంది. కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒకరు ఆర్మీ లెఫ్టినెంట్‌ అధికారి కాగా, మిగిలిన ముగ్గురు జవాన్లు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాక్‌ సైనికులు ఆదివారం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆటోమేటిక్‌ తుపాకులు, మోర్టార్లతో పౌర ప్రాంతాలపైనా దాడి చేశారు. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి.

పాక్ కాల్పుల‌పై భార‌త్ ఆర్మీ తీవ్రంగా స్పందించింది. మాటలతో కాదు, చేతలతోనే పాక్ కు సమాధానం చెబుతామంటోంది భారత ఆర్మీ. . నిన్న సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడి భారత జవాన్లను బలితీసుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది.

ప్రతీకారం అన్నది మాటల రూపంలో కాకుండా జరిగిపోతుంది. దాని గురించి నేను చెప్పను. చేతలతోనే దానికి బదులిస్తాం’’ అని ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ అన్నారు. జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్ లో నిన్న పాకిస్థాన్ దళాల కాల్పులకు నలుగురు భారత జవాన్లు నెలకొరగడంతో దీనిపై ఆర్మీ జవాన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్థాన్ చర్యలను క్షమించేది లేదని, దీనికి ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ అహిర్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -