Wednesday, May 15, 2024
- Advertisement -

విదేశీ బ్యాంక్ పై పిటీషన్

- Advertisement -

భారతీయ వ్యాపారవేత్త, అతని భార్య ఓ విదేశీ బ్యాంకుపై భారీ మొత్తంలో నష్టపరిహారం కోరుతూ దావా వేశారు. వెస్ట్ ఆస్ట్రేలియన్ ఫెర్టిలైజేషన్ కంపెనీలో ఈ జంటకు షేర్లు ఉన్నాయి. ఈ షేర్లను అక్రమంగా తక్కువ ధరకు విక్రయించారంటూ ఆ బ్యాంక్ పై భారతీయ దంపతులు పంకజ్ ఓస్వాల్, రాధిక దావా వేశారు. ఈ నష్టానికి పరిహారంగా వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ వీరు డిమాండ్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ బ్యాంకింగ్ గ్రూప్ తమకు 6733 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ వీరు విక్టోరియా సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసినట్లు ఓ వార్తా సంస్ధ పేర్కొంది. 2010 సంవత్సరంలో బర్రప్ ఫెర్టిలైజర్ కంపెనీలో 65 శాతం వాటాలను నాలుగు వందల మిలియన్ డాలర్లకు అమ్ముకున్నారని ఓస్వాల్ తరఫు న్యాయవాది టోనీ బనాన్ వాదించారు.

నిజానికి షేర్లు విక్రయించే సమయంలో వాటి ధర తొమ్మి వందల మిలియన్ డాలర్లు ఉందని, దీని వల్ల అప్పుల్లో కూరుకుపోయిన తమ క్లయింట్ కు ప్రస్తుత విలువ ప్రకారం డబ్బు చెల్లించాలని న్యాయవాది కోర్టును కోరారు. మరోవైపు ఈ కేసును వదులుకోవాలంటూ బర్రప్ ఫెర్టలైజర్ ప్రతినిధి తమను బెదిరించారని ఓస్వాల్ దంపతులు ఆరోపిస్తున్నారు. స్వాన్ రివర్ లో తాము కట్టుకుంటున్న నివాసాన్ని మధ్యలోనే నిలిపివేశామని, దీంతో పాటు ఖరీదైన జెట్, విలాసవంతమైన కార్లను కూడా విక్రయించామని ఆయన చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -