Tuesday, May 21, 2024
- Advertisement -

లిరా ప్ర‌భావం… చ‌రిత్ర‌లో తొలిసారిగా భారీగా ప‌త‌న‌మైన రూపాయి విలువ‌…

- Advertisement -

రూపాయి మరింతగా పతనమైంది. మంగళవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి… డాలరుతో మారకపు విలువ రూ.70కి చేరిపోయింది. టర్కీలో ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కిష్‌ లిరా భారీగా పతనమవుతుండడంతో ఆ ప్రభావం మన కరెన్సీపైనా పడుతోంది. మార్కెట్ చ‌రిత్ర‌లో తొలిసారి డాల‌ర్‌తో రూపాయి విలువ మ‌రింత ప‌త‌నం కావ‌డం ఇదే తొలిసారి.

సోమ‌వారం మార్కెట్ల‌లో రూపాయి విలువ 69.91 వ‌ద్ద నిలిచిపోయింది. అయితే అక్క‌డ నుంచి మొద‌లైన ట్రేడింగ్ ఇవాళ ఉద‌యం ఆరంభంలో కొంత మెరుగుప‌డింది. 23 పైస‌లు కోలుకుని 69.28 వ‌ద్ద కొద్ది సేపు నిలిచింది. ట‌ర్కీ క‌రెన్సీ లీరా ప్ర‌కంప‌న‌లు ద‌లాల్ స్ట్రీట్‌ను తాక‌డంతో రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌న‌మైంది. ఉద‌యం 10.30 గంట‌ల స‌మ‌యంలో.. డాల‌ర్ విలువ 70.07గా న‌మోదు అయ్యింది.

టర్కీ ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించనుందన్న అంచనాలతో వివిధ దేశాల కరెన్సీలు కూడా పతనం అయ్యాయి. లీరా క్షీణత కారణంగా రూపా యి కూడా దిగజారిందని ప్రభుత్వ రంగ బ్యాంకు ట్రెజరర్ ఒకరు అభిప్రాయపడ్డారు.

వీటికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు తగ్గడంతో పాటు చము రు ధరల ప్రభావం కూ డా రూపాయిపై ప్రభా వం పడిందని అన్నా రు. ప్రస్తుత మారకం విలువ మరింత పతనం కాకుండా రిజర్వ్‌బ్యాంక్ చర్యలు తీసుకుంటుందని మరో సీనియర్ ట్రెజరీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -