Friday, May 10, 2024
- Advertisement -

న‌ష్టాల‌నుంచి లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు….

- Advertisement -

కొన్ని రోజులుగా ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్, నిఫ్టీ చివరకు మంచి లాభాలతో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, పెట్రో ధరల పెంపుతో ఇవాళ కూడా సూచీలు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఒకానొక సమయంలో సెన్సెక్ 200 పాయింట్లకు పైగా పతనమైంది.

మ‌ధ్యాహ్నం నుంచి సూచీలు కోలుకున్నాయి. ఓ దశలో 400 పాయింట్ల వరకు లాభాలను ఆర్జించింది. నిఫ్టీ కూడా 11 వేల ఎగువకు చేరింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 36,652 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 11,067 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.65తో స్థిరంగా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బలరాంపూర్ చీనీ మిల్స్ (6.88%), ఎన్వోసీఐఎల్ (6.48%), ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.06%), డీసీఎం శ్రీరామ్ (5.77%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (5.74%).

టాప్ లూజర్స్:
దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-23.49%), ఐఎఫ్సీఐ (-11.27%), జెట్ ఎయిర్ వేస్ (-9.81%), వక్రాంగీ (-8.82%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (-8.17%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -