Wednesday, May 15, 2024
- Advertisement -

అంపైర్ల‌పై కోపంతో ఊగిపోయిన విరాట్ కోహ్లీ…

- Advertisement -

క్రికెట్‌లో అంపైర్లు తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాల్ప‌దం అవుతున్నాయి. తాజాగా ఐపీఎల్ లో కూడా అంపైర్ తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర వివాదాస్ప‌దం అయ్యింది. సీజన్ ఆరంభమై వారమైనా గడవకముందే.. రెండు ఘటనలు ఐపీఎల్‌కి మచ్చతెచ్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని ‘మాన్కడింగ్’ రనౌట్ చేయడం వివాదాస్ప‌దం కాగా…. తాజాగా ఫీల్డ్ అంపైర్ ఏమరపాటు కారణంగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం మారిపోయింది. దీంతో అంపైర్ల తీరుపై ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గురువారం సొంత మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీ విజయానికి చివరి 5 బంతుల్లో 11 పరుగులు కావాల్సి ఉండగా.. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ మలింగ 4 పరుగులే ఇచ్చి ముంబైని గట్టెక్కించాడు. అయితే ఆఖ‌రు బంతి నోబాల్ అయినా అంపైర్ గ‌మ‌నించ‌కుండా పొర‌పాటు చేశారు. మ్యాచ్‌ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లి.. ప్రజంటేషన్‌ పోడియం వైపు దూసుకు వచ్చి అంపైర్ల తప్పుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కోహ్లీ జట్టు విజయానికి చివరి 6 బంతుల్లో 17 పరుగులు అసవరంకాగా.. ఆఖరి ఓవర్ వేసిన మలింగ బౌలింగ్‌లో తొలి బంతినే శివమ్ దూబే సిక్స్‌గా మలిచాడు. దీంతో.. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారిపోగా.. తర్వాత బంతికి దూబే సింగిల్ తీసివ్వడంతో ఏబీ స్ట్రైకింగ్‌కి వెళ్లాడు. మాలింగ యార్క‌ర్లు సంధించి మూడు, నాలుగు, ఐదు బంతులకి సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. ఖరి బంతికి 7 పరుగులు అవసరంకాగా.. మలింగ విసిరిన లోపుల్‌టాస్ బంతిని.. లాంగాన్ దిశగా దూబే హిట్ చేశాడు. కానీ.. దాన్ని బౌండరీ లైన్ వద్ద ముంబయి ఫీల్డర్లు పొలార్డ్, రోహిత్ శర్మ మంచి సమన్వయంతో అడ్డుకున్నారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. నంతరం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -