Sunday, May 19, 2024
- Advertisement -

భ‌విష్య‌త్తులో అంత‌రిక్షంలోకి మాన‌వుల‌ను పంపాల‌న్న ఇస్రోక‌ల సాకారం కానుంది.

- Advertisement -
ISRO scripts history: ISRO GSLV Mk-III D1 successfully launches

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 ప్ర‌యేగం స‌క్సెస్ అయ్యింది. 640 టన్నుల జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌3 డి1 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ గ‌గ‌నంలోకి దూసుకెల్లింది.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల సతీష్‌ ధావన అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్‌) నుంచి సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది.
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 పొడవు 43.43 మీటర్లు. బరువు 640 టన్నులు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని 16.20 నిమిషాల్లో పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు సంకల్పించారు. కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్‌–200)ను మండించటంతో రాకెట్‌ ప్రయాణం ప్రారంభమవుతుంది. తర్వాత 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్‌–110) మండించి రాకెట్‌ ప్రయాణ స్పీడ్‌ను పెంచుతారు. 2.20 నిమిషాలకు ఎస్‌–200 రెండు బూస్టర్లు విడిపోయి మొదటిదశను పూర్తి చేస్తాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తవుతుంది.

{loadmodule mod_custom,GA1}

జీశాట్ 19 ఉపగ్రహ బరువు 3,136 కిలోగ్రాములు ఉప‌గ్ర‌హాన్ని నింగిలోకి తీసుకెల్లింది. నిజానికి ఈ స్థాయి బరువున్న ఉపగ్రహాలను ఇంత వరకు మన దేశం నుంచి ప్రయోగించలేదు. ఇదే మొదటిసారి. 2,300 కిలోగ్రాములకు పైన బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భారత్ ఇప్పటి వరకు విదేశీ ప్రయోగ కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది. నేటి ప్రయోగం విజయవంతం అయితే ఇక భారత్ విదేశాలపై ఆధారపడనక్కర్లేదు. దీంతో ఒక్కో ప్రయోగం రూపంలో రూ.400 కోట్లు ఆదా అవుతాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయి బరువుగల ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్ లకు మాత్రమే ఉండగా, భారత్ కూడా వీటి సరసన చేరింది.
జీఎస్ఎల్వీ ఎంకే3-డీ1ను ఇస్రో స్వయంగా అభివృద్ధి చేసింది. ఇది 4,000 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. తక్కువ ఎత్తులో ఉన్న భూ కక్ష్యలోకి అయితే 10,000 కిలోల బరువుగల ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలదు. సైంటిస్టులు దీన్ని మాన్ స్టర్ రాకెట్ గా అభివర్ణిస్తున్నారు. అంతరిక్షంలోకి మానవులను పంపించాలన్న భారత్ కలను ఈ రాకెట్ తో భ‌విష్య‌త్తులో స‌హాకారం కానుంది.

{loadmodule mod_custom,GA2}

జీశాట్ -19 తో 4జీ, ఇతర సమాచార సేవలు పటిష్ఠం కానున్నాయి. గతంలో ప్రయోగించిన ఆరు సమాచార శాటిలైట్లకు దీటుగా ఒక్క జీశాట్ – 19 పనిచేయనుంది. లిథియం అయాన్ బ్యాటరీలను ఇందులో ఏర్పాటు చేయడం విశేషం.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -