Saturday, April 27, 2024
- Advertisement -

ఇస్రో మరో అద్భుతం..పీఎస్ఎల్వీ- సీ49 – ఒకేసారి నింగిలోకి పది ఉపగ్రహాలు!

- Advertisement -

ఇస్రో ఖాతలో మరో అద్భుతం చోటు చేసుకుంది. ఒకేసారి పది ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం శ్రీహరికోట నుంచి PSLV-C49 రాకెట్ ను ప్రయోగించారు. తొలి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. 290 టన్నుల బరువున్న ఈ రాకెట్ ద్వారా..ఒక స్వదేశీ, 9 విదేశీ ఉప గ్రహాలను రోదసీలోకి పంపింది ఇస్రో. రాకెట్ నుంచి విడవడిన అన్ని ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశించాయి. మొదటిగా, పీఎస్ఎల్వీ సీ-49 నాలుగో దశలో ఈఓఎస్-01 విజయవంతంగా విడిపోయింది.

ఆ తర్వాత మిగిలిన 9 ఉపగ్రహాలను వాటి కక్ష్యలో చేర్చడంతో మిషన్ పూర్తయింది.  శ్రీహరికోటలో వర్షం పడడంతో 3.02 గంటలకు బదులు 3.12 గంటలకు పీఎస్ఎల్వీ సీ-49 నింగిలోకి దూసుకెళ్లింది. కరోనాతో కొన్నాళ్లుగా ప్రయోగాలకు దూరంగా ఉన్న ఇస్రో.. పీఎస్‌ఎల్‌వీ సీ-49 ప్రయోగించింది. ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది.

కేవలం 13.55 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తయ్యింది. ప్రయోగం సక్సెస్ అవడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. వాహకనౌకకు రూ.175 కోట్లు, ఉపగ్రహానికి రూ. 125 కోట్ల వరకు వ్యయం చేశారు.

అక్కడ ఒక్క గొర్రె ధర అక్షరాలా మూడు కోట్లు.. ఎక్కడంటే..?

లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!

జంతువుల మధ్య ఈ ప్రేమను చూస్తే కన్నీల్లోస్తాయి..?

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -