Monday, May 20, 2024
- Advertisement -

వాట్స్‌ప్‌పై రూ.21 కోట్ల జ‌రిమానాను విధించిన ఇట‌లీ కోర్టు

- Advertisement -
Italy court fined on whatsapp over$3 Million For Data Sharing

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు భారీ జ‌రిమానా విధించింది ఇట‌లీ. బలవంతంగా యూజర్ల వ్యక్తిగత డేటాను పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో షేరు చేపిస్తుందనే నెపంతో ఇటలీ 3.3 మిలియన్ డాలర్లకు పైగానే అంటే మ‌న లెక్క‌ల్లో 21 కోట్లకు పైగా జరిమానా.

ఫేస్ బుక్ తో వాట్సాప్ డేటా షేరింగ్ పై అనుమానాలు ఉన్నాయని 28 దేశాల యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటక్షన్ అధికారులు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు. కానీ వాట్సాప్ మాత్రం యూజర్ల డేటాను ఫేస్ బుక్ షేర్ చేస్తోంది.అయితే కోర్టు నిర్ణ‌యాన్ని స‌మీక్షిస్తున్నామ‌ని..త్వ‌ర‌లోనే త‌మ స్పంద‌న తెలియ జేస్తామ‌ని వాట్స్‌ప్ అధికారి తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 1}

2014లో మెసేజింగ్ యాప్ లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకుంది. 2016 ఆగస్టు నుంచి వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ మార్చి, యూజర్ల డేటాను ఫేస్ బుక్ తో షేరు చేయడం ప్రారంభించింది. ఈ విషయంపై ఇప్పటికే చాలా దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే వాట్సాప్ మాత్రం ఈ ప్రక్రియను నిలిపివేయడం లేదు. భారత్ లో సైతం దీనిపై ఆందోళన రేకెత్తాయి. 2016 సెప్టెంబర్ లో వాట్సాప్ కొత్త పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి.
దాన్ని విచారించిన కోర్టు 2016 సెప్టెంబర్ 25కు ముందు సేకరించిన యూజర్ల డేటాను ఫేస్ బుక్ లేదా మరే ఇతర సంబంధిత కంపెనీలతో పంచుకోకూడదని ఢిల్లీ హైకోర్టు వాట్సాప్ ను ఆదేశించిన విష‌యం తెలిసిందే.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -