Friday, May 10, 2024
- Advertisement -

రానున్న రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ కూడా వద్దంటారేమో..!

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కళా వెంకట్రావు అరెస్టు ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి? అని డీజీపీ గౌతం సవాంగ్‌ను ప్రశ్నించారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసిన 5 రోజుల తర్వాత రామతీర్థం వెళ్లిన.. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించే విధానం ఇదేనా.. డీజీపీ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కళా వెంకట్రావుపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.

న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం కూడా అనవసరం అనే రీతిలో జగన్ వ్యవహరించారన్న చంద్రబాబు… రానున్న రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ కూడా వద్దంటారేమోనని విమర్శించారు. ఏ రాజ్యాంగ వ్యవస్థపైనా గౌరవం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. కరోనా వేళ ఎన్నికలు నిర్వహించాలని చూశారన్న చంద్రబాబు.. కరోనా తగ్గాక ఎన్నికలు పెడుతుంటే వద్దంటున్నారని ఆగ్రహించారు.

అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్​పై చేసిన ఆరోపణలు ఏమయ్యాయని.. చంద్రబాబు ప్రశ్నించారు. గుడివాడలో పేకాట శిబిరాలపై దాడిలో పాల్గొన్న ఎస్సై మరణం అనుమానాస్పదమేనన్న ఆయన.. అసలు వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర ఎందుకు జరగదో తాము చూస్తామని తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -