Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీ నేతలు వెనక్కు తగ్గారు: జగన్ దే పై చేయి!

- Advertisement -

ప్రత్యేక హోదా డిమాండ్ తో  గుంటూరు లో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలిన తెలుగుదేశం మంత్రులు, అధికార పార్టీ నేతలు వెనక్కు తగ్గారు.

జగన్ దీక్ష నకిలీ అని…  అందులో నిజం లేదని వ్యాఖ్యానించిన మంత్రులు ఇప్పుడు వెనక్కు తగ్గారు. జగన్ మోహన్ రెడ్డి షుగర్ లెవల్ తగ్గడం లేదని పెరుగుతున్నాయని  వ్యాఖ్యానించి మంటలు పుట్టించిన అధికార పక్షం నేతలు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు. ఐదురోజులుగా జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఇష్టానుసారం మాట్లాడారు తెలుగుదేశం నేతలు. దానికి తోడు కొన్ని మీడియా వర్గాలు కూడా తోడవ్వడంతో వారు రెచ్చిపోయారు. 

అయితే దీనిపై స్వయంగా జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తన ఆరోగ్యస్థితి గురించి వారి అవాకుచవాకులపై జగన్ అభ్యంతరం చెప్పారు. మీడియాను ముందు పెట్టుకుని.. తన ఆరోగ్య స్థితిపై పరీక్షలు జరుపుదామని.. ఈ విషయంలో తన సవాలుకు ముందుకు రావలని జగన్ తెలుగుదేశం నేతలకు స్పష్టమైన సవాలు విసిరారు. అయితే దీనిపై మంత్రులు స్పందించడం లేదు. దీక్షలో ఉన్న జగన్ సవాలు విసిరినా వారు మారు మాట్లాడటం లేదంటే నైతికంగా ఓడిపోయినట్టే.

జగన్ కు వైద్య పరీక్షలు జరిపి.. ఆయన ఆరోగ్య పరిస్థితి పై మీడియా సాక్షిగా పరీక్షలకు ఒప్పుకుంటే… తీరా దీక్షతో జగన్ ఆరోగ్య పరిస్థితి విషయించిందన్న విషయాన్ని ప్రకటించాల్సి వస్తే అధికార పార్టీకి అంతకన్నా అవమానం లేదు. అప్పుడు తామంతకు తాము ఎదవలవ్వడంతో పాటు.. జగన్ దీక్షకు గొప్ప ప్రచారంకల్పించినట్టు అవుతుంది. అందుకే వారు మారు మాట్లాడటం లేదు. అయితే ఇలా బురద చల్లి వెళ్లిపోతే కాదు కదా.. తెలుగుదేశం వాళ్లకు నైతికత లేకపోయినా.. నైతికంగా ఆలోచించే జనాల దృష్టిలో మాత్రం తెలుగుదేశం చీప్ అయిపోవడం నిజం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -