Sunday, May 5, 2024
- Advertisement -

పంజాబ్ ద‌స‌రావేడుక‌ల్లో ఘోర రైలు ప్ర‌మాదం ..50 మందికిపైగా దుర్మ‌ణం

- Advertisement -

పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమృత్‌సర్‌ దసరా వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 50 పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం.రావణ దహానాన్ని చూసేందుకు రైలు పట్టాలపై నిలబడినవారిని రైలు ఢీకొనడంతో 50 మంది పైగా మృతి చెందినట్లు సమాచారం. ప‌లువురు గాయ‌ప‌డ్డారు.

దసరా వేడుకలు పురస్కరించుకుని చౌడా బజార్‌లోని మైదానంలో శుక్రవారం రాత్రి రవాణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. చాలామంది రైల్వే పట్టాలపై నిల్చుని రావణ దహనాన్ని చూస్తున్న సమయంలో అతి వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతం క్షణాల్లోనే రక్తసిక్తమైంది.

క్కడ చూసిన తెగిన శరీర భాగాలే కనిపించాయి. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మండిపడుతున్నారు.

రావణ దహనం కార్యక్రమానికి సుమారు 700 మందికి పైగా హాజరయ్యారు.ఇప్పటి వరకు 15 మృతదేహాలను బయటకు తీశారు. రైలు ఢీకొనడంతో శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారిలో కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -