Wednesday, May 15, 2024
- Advertisement -

రైతుల దెబ్బకి..రైల్వేశాఖకు భారీ నష్టం..!

- Advertisement -

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​లో రైతులు చేపడుతున్న ఉద్యమంతో రైల్వేశాఖకు రూ.2400కోట్ల నష్టం వాటిల్లిందని ఉత్తర రైల్వే జనరల్​ మేనేజర్​ అశుతోష్​ గంగాల్​ తెలిపారు.

వ్యవసాయ చట్టాలపై ఆందోళనలో భాగంగా పంజాబ్​లో సెప్టెంబర్​ 24 నుంచి నవంబర్​ 24 వరకు రెండు నెలలపాటు రైలు సేవలు పూర్తిగా రద్దయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్నా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​లో రైతులు చేపడుతున్న ఉద్యమంతో రైల్వేశాఖకు రూ.2400కోట్ల నష్టం వాటిల్లిందని ఉత్తర రైల్వే జనరల్​ మేనేజర్​ అశుతోష్​ గంగాల్​ తెలిపారు.

”బియాస్​, అమృత్​సర్​ మధ్యలో ఉన్న కొన్ని రైల్వే లైన్లను రైతులు ప్రస్తుతం నిర్బంధించారు. దీనిని అధిగమించడానికి తార్న్​ తరన్​ మీదుగా మరొక మార్గాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ తక్కువ సామర్థ్యంతో ఎక్కువ దూరం ప్రయాణమార్గం అయినందున కావాల్సినదానికంటే తక్కువ రైళ్లను నడుపుతున్నాం. గూడ్స్​ రైళ్లు సైతం ప్రభావితమయ్యాయి. మా అంచనా ప్రకారం రూ.2400 కోట్ల నష్టం వాటిల్లింది అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -