Saturday, June 1, 2024
- Advertisement -

ప‌రోక్షంగా ట్విట్ట‌ర్‌లో క‌త్తికి కౌంట‌ర్… ఇచ్చిన జ‌న‌సేనాని..

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోషల్ మీడియా వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్ర‌ధానంగా క‌త్తిమ‌హేష్, ప‌వ‌న్ అభిమానులు మ‌ధ్య సోషియ‌ల్ వార్ న‌డుస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌న‌వ్ వాటిమీద స్పందించ‌లేదు.

కాంగ్రెస్ నేతలు , తెలుగుదేశం నాయకులు అలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , క‌త్తి మ‌హేష్‌ వంటి చిన్న చితక వారు సైతం పవన్ ఫై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతో వారందరికీ తనదయిన స్టయిల్ లో కౌంటర్ వేసి వార్తల్లో నిలిచాడు పవన్.

వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లే… నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు’ అంటూ ఓ మెసేజ్ ను పోస్ట్ చేశారు. దీన్ని ఎవరు చెప్పారో తనకు తెలియదు కానీ… గౌరవనీయ ఓ సీనియర్ జర్నలిస్టు తనను ఈ విధంగా గ్రీట్ చేశారంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీన్ని షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పారు.

కులాల పరంగా విడిపోవడం, అధికారమే పరమావధిగా సాగే రాజకీయాలు ప్రస్తుత తరుణంలో పోషిస్తున్న పాత్ర ప్రమాద ఘంటికలను మోగిస్తోందని పవన్ అన్నారు. ఇది మన ఆర్థిక మందగమనానికి కారణం కావడమే కాక, మన సమాజానికి అత్యంత కీడును కలగజేస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈట్వీట్ సంచ‌ల‌నంగా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -