Saturday, May 18, 2024
- Advertisement -

డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ప్ర‌యివేటీ క‌ర‌ణ‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను హెచ్చరించిన ప‌వ‌న్‌..

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర మూడు రోజు ప‌ర్య‌ట‌న కొనసాగుతోంది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నా ప‌వ‌న్‌కు అభిమానులు స్వాగ‌తం ప‌లికారు. పవన్ తొలుత ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించారు.. ఆ తర్వాత డీసీఐ ఉద్యోగుల దీక్షా శిబిరం వద్ద వారికి మద్దతు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై విరుచుకు ప‌డ్డారు. లాభాల్లో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎందుకు ప్ర‌యివేటు ప‌రం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఓట్లడిగేటప్పుడు ప్రజలే దేవుళ్లు అని ఇంటింటికి వెళ్లి, సమస్యలు వచ్చినప్పుడు ప్రజల్ని పట్టించుకోని నేతలకు ఓట్లడిగే హక్కులేదు. లేదు..లేదు…2019 ఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదన్నారు. ఎంపీలు హ‌రిబాబు, అవంతి శ్రీనివాస్‌లు స‌మ‌స్య‌నుంచి త‌ప్పించుకోవ‌చ్చేమోగాని నేను ప్ర‌జా స‌మ‌స్య‌ల‌నుంచి త‌ప్పించుకోన‌న్నారు.

2014 సభలో మోదీ కానీ, చంద్రబాబు కానీ బంధువులు కాదని చెప్పాను. నాకు బంధువులైనా, స్నేహితులైనా మీరేన‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో భాజాపా, టీడీపీ ల‌కు స‌పోర్ట్ ఇచ్చాన‌న్నారు. అందుకే ఈరోజు స‌మ‌స్య‌ల‌మీద పోరాటం చేయ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చాన‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -