Thursday, May 16, 2024
- Advertisement -

వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినీ టార్గెట్ చేయ‌ను…నా పోరాటం ఆగ‌దు ఇలాగే ఉంటా క‌త్తిమ‌హేష్‌

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేష్ వివాదం దాదాపు ఓ కొలిక్కి వచ్చిన సంకేతాలు వెలువడుతున్నాయి. జనసేన కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి లేఖ రాశారు. దీంతో కత్తి మహేష్ కాస్త మెత్తబడ్డారు. అంతకు ముందు తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టిన కత్తి దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో వివాదం తాత్కాలికంగా స‌ద్దుమ‌నిగిన‌ట్లే.

అయితే దీనిపై క‌త్తి స్పందించారు. ఇలాంటి లేఖలతో తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్ తనకు క్షమాపణలు చెప్పే వరకు తాను విశ్రమించనని తెలిపాడు. తనపై దాడి జరిగిన తర్వాతే ఈ లేఖ వచ్చిందంటే… ఇప్పుడు వరకు దాడి కోసం వేచి చూశారా అని ప్రశ్నించాడు. ఇదే లేఖ ఇంతకు ముందు వచ్చి ఉంటే సరేనని, దాడి జరిగిన తర్వాత వచ్చింది కాబట్టి తాను పోరాటం కొనసాగిస్తానని కత్తి తెలిపాడు.

పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు,ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను.

— Kathi Mahesh (@kathimahesh) January 20, 2018

క‌త్తిమ‌హేష్ ట్విట్‌పై హైప‌ర్ ఆది ట్విట్ట‌ర్‌లో స్పందించారు.‘మీరు చాల మంచి స్వభావం, టాలెంట్ ఉన్న వ్యక్తి.. దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. దుష్ప్రచారం చేయడం కాకుండా మంచి కోసం పనిచేయండి. అప్పుడు మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ పైకి వస్తారు. ఆల్‌ ది బెస్ట్‌’ అని సూచించారు. దీనికి కత్తి బదులిస్తూ.. ‘ఎవరిపైకి..’ అంటూ సరదాగా రీట్వీట్‌ చేశారు.

ఎవరి పైకి??

— Kathi Mahesh (@kathimahessh) January 20, 2018

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -