Tuesday, May 14, 2024
- Advertisement -

బాబూ, కేసీఆర్ లు ఇద్దరూ కాగితపు పులులేనా?!

- Advertisement -

ఒకరేమో ప్రపంచంలోని ప్రతి నగరం పేరునూ పఠిస్తారు. సీమాంధ్రలో అలాంటి నగరాన్ని కడతానని డప్పు కొడతారు. కొత్త రాజధాని సింగపూర్ లా ఉంటుంది.. షాంఘై లెవల్లో ఉంటుందని చెప్పుకొస్తారు.

మరొకరు బంగారు తెలంగాణ అంటారు. ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయ్యింది కాబట్టి.. ఇక్కడి బడుగు వాడి జీవితాన్ని బంగారు మయం చేస్తానని అంటారు.

ఇలా ఇద్దరి నేతల మాటలకు హద్దూపద్దూ లేకుండా పోతోంది. ఒకరికి మించిన స్థాయిలో మరొకరు మాటలు చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చే నేతలను చూశాం కాని.. ఇలా ఎన్నికల తర్వాత కూడా అద్భుతాలు చేస్తామంటూ చెబుతున్న నేతలు మాత్రం కేసీఆర్, చంద్రబాబులే అని జనాలు అనుకొంటున్నా… వీరు తగ్గడం లేదు!

మరి ఈ ఇద్దరు నేతలూ మాటలతో మాయ చేస్తున్నారు కానీ.. వాస్తవంలో మాత్రం అసలు విషయాలు అర్థం అయిపోతున్నాయి. ఉభయ రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ స్తంభించిపోయింది. బస్సు కదలడం లేదు. తమ జీతాలను పెంచితే తప్ప బస్సు కదిలేది ఉండదని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఎన్నికల ముందేమో.. ప్రభుత్వ ఉద్యోగులకు సమాన స్థాయిలో జీతాలను పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు కేసీఆర్ లు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని.. కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరి మాటెత్తితే.. సింగపూర్, షాంఘై అంటూ కబుర్లు చెప్పే నేతలు.. ఆర్టీసీ కార్మికుల విషయంలో మాత్రం ఎందుకు ఆ స్థాయిలో వ్యవహరించలేకపోతున్నారు? అద్భుతాలు చేయగల  సామర్థ్యం ఉన్న నేతలు ఎందుకు కార్మికులను సంతృప్త పరిచి సమ్మెను ఆపించలేకపోతున్నారు?!  ఈ నేతలిద్దరూ చెప్పేది ఉత్తమాటలు అనేదానికి ఇదే రుజువా?! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -