Monday, May 20, 2024
- Advertisement -

కెసిఆర్ చేసిన అతిపెద్ద తప్పు

- Advertisement -

రాజకీయాల్లో రహస్య మిత్రులు చాలా కామన్, అవసరం అయినప్పుడు మాత్రమే వారి పేర్లు బయట పెడుతూ వారికీ మనకీ ఉన్న సంబంధాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయాలి. పొత్తులు పెట్టుకోవడానికీ , కీలక సమయాల్లో అధికారం దక్కించుకోవడం కోసం ఈ రహస్య మైత్రి బాగా వర్క్ అవుతుంది.

ఇలాంటి విషయాల్లో కెసిఆర్ తక్కువ ఏమీ కాదు మజ్లిస్ తో స్నేహం ఆయనకీ ఎప్పటి నుంచో ఉన్నదే. అప్పట్లో తెలంగాణా అసంబ్లీ లోనే తెరాస కి మిత్ర పక్షంగా తాము ఉంటూ అభివృద్ధి కి సహకరిస్తాం అని చెప్పారు మజ్లిస్ వారు. అది చూసి చాలా మంది విస్మయానికి గురయ్యారు కూడా . ఇప్పుడు కీలకమైన గ్రేటర్ ఎన్నికల నేపధ్యం లో మజ్లిస్ తమ మిత్రుడు అంటూ కెసిఆర్ చెప్పడం తెరాస కి ఏరకమైన సహాయం చేస్తుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వారు మిత్రులు అని ఒప్పుకోవడమే కాకుండా అవసరమైతే పొత్తు కూడా పెట్టుకుంటాం అన్నారు కెసిఆర్. గ్రేటర్ పరిథి లో నూట యాభై స్థానాల్లో నలభై స్థానాలు మజ్లిస్ కి అనుకూలం మజ్లిస్ – తెరాస రెండూ కలిసి డీ అంటే డీ అనుకునే ప్లేస్ లు చాలానే ఉన్నాయి. ఒక చోట ఫైట్ చేస్తూ మరొక చోట మిత్రుడు అని ఎలా అంటారు ? ఒక మిత్రుడితో తలపడుతూ మరోపక్క.. వారితో కలిసి చెట్టాపట్టాలు వేసుకునేందుకు తాము సిద్ధమని తేల్చి చెప్పటం.. మజ్లిస్ ను వ్యతిరేకించే వారిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇలా ప్రకటించడం కెసిఆర్ చేసిన అతిపెద్ద తప్పు అని అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -