Saturday, May 18, 2024
- Advertisement -

హెల్త్ రంగంలో వంద కోట్ల పెట్టుబడులు

- Advertisement -

తెలంగాణ ఐటి మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటన తొలి రోజే విజయవంతమైంది. తన సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన మంత్రి తొలి రోజే ఏకంగా వంద కోట్ల రూపాయల పెట్టుబడితో కంపెనీ స్ధాపించేందుకు ముందుకు వచ్చిన ఎక్లాట్ హెల్త్ కేర్ తో కీలక ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణలో తమ కంపెనీ వంద కోట్ల రూపాయల పెట్టుబడులతో కంపెనీ ప్రారంభిస్తుందని అమెరికాకు చెందిన సంస్ధలు చెప్పాయి.

ఈ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలను చేసుకుంది. వంద కోట్ల పెటుబడితో తమ కంపెనీ తెలంగాణలో ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని ఎక్లాట్ కంపెనీ ప్రకటించింది. అమెరికాలో దిగిన కెటిఆర్ కు ప్రవాస భారతీయుల సంఘం ఘన స్వాగతం పలికింది. అక్కడి నుంచి ఆయన భారత కౌన్సెలేట్ సయిద్ ను కలిసారు.

అక్కడి నుంచి వారిద్దరు ఇల్లినాయిస్ డిప్యూటీ గవర్నర్ టెరి చిల్డ్రెస్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి తమ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలిగిస్తుందని కెటిఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, అక్కడి టి హబ్ గురించి తమకు తెలిసిందని,ఇల్లివాయిస్ ఉన్న అనేక ఐటి సంస్ధలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని డిప్యూటీ గవర్నర్ తెలిపారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -