Wednesday, May 15, 2024
- Advertisement -

తక్కువ రేట్లకే విద్యా రుణాలన

- Advertisement -

దేశంలో మహిళల విద్య పెరగనుంది. ఇన్నాళ్లు చదువు కొనేందుకు డబ్బు లేక మధ్యలోనే చదువుకు స్వస్తి పలికిన అమ్మాయిలు ఇక ముందు వారికి ఎంత చదువు చదవాలంటే అంత చదువుకునే వీలు కలుగుతోంది. ఉన్నత విద్యకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సృతి ఇరానీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలకు లేఖలు రాసారు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కింద వారం రోజుల లోపే విద్యార్ధినులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖ్లలో పేర్కొన్నారు. ఉన్నత విద్య విషయంలో తల్లితండ్రులు అబ్బాయిలకు ఇస్తున్న విలువ అమ్మాయిలకు ఇవ్వడం లేదు.

విద్య కోసం ఇచ్చే రుణాల వడ్డీ రేటు కూడా ఎక్కువ ఉండడంతో విద్యార్ధినుల చదువు మధ్యలోనే ఆగిపోతోంది. దీని కోసం ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడితే మంచిదని మేనకా గాంధీ లేఖలో అభిప్రాయపడ్డారు. మేనకాగాంధీ చేసిన ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే అమ్మాయిల చదువుకు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -