Saturday, May 18, 2024
- Advertisement -

సీమ‌లో మ‌రో సారి టీడీపీలో వెన్నుపోటు రాజ‌కీయం…

- Advertisement -
MP CM Ramesh Vs Minister Adinarayana Reddy

క‌డ‌ప జిల్లా టీడీపీలో ఇద్ద‌రు ముఖ్య‌ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు కొన‌సాగుతోంది.ఈమ‌ధ్య‌నే టీడీపీలోకి ఫిరాయించిన నేత ….ఎంపీ మ‌ధ్య ఇప్పుడు వార్ మొద‌ల‌య్యింది.టీడీపీలోకి వ‌చ్చేందుకు…మంత్రి ప‌ద‌వి వ‌చ్చేదుకు స‌హ‌క‌రించిన నేత‌కే వెన్నుపోటు పొడిచార‌నే వార్త‌లు జిల్లావ్యాప్తంగా సంచ‌ల‌నం రెకెత్తిస్తున్నాయి.ఇది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

వైసీపీ త‌రుపున జ‌మ్మ‌ల‌మ‌డుగు నియేక‌వ‌ర్గంనుంచి గెలిచి టీడీపీలోకి పిరాయించారు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి.ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకురావడంలో, ఆతర్వాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చేలా సీఎంను ఒప్పించడంలో సీఎం రమేష్ ప్రముఖ పాత్ర పోషించారు.జిల్లాలో సీఎం రమేష్‌పైనా ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకున్న ఆదినారాయణరెడ్డి ఏకంగా సీఎం రమేష్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు.

{loadmodule mod_custom,GA1}

జిల్లాలో సీఎం రమేష్‌ కాంట్రాక్ట్ తీసుకుని చేస్తున్న గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని, తీవ్ర జాప్యం జరుగుతోందని చంద్రబాబుకు ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు చేసినట్టు జిల్లా నేతలు చెబుతున్నారు. అయితే సీఎం రమేష్‌ ఆర్థిక సేవలు మెచ్చి ఏకంగా రాజ్యసభకు పంపిన సీఎం చంద్రబాబు ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు అంశాన్నినేరుగా సీఎం రమేష్‌కు చెప్పేశారట.
దీంతో ఆదినారాయణరెడ్డిపై సీఎం రమేష్‌ నిప్పులు చెరుగుతున్నారు. రామసుబ్బారెడ్డిని కాదని టీడీపీలోకి వచ్చేందుకు ఆదినారాయణరెడ్డికి స్వయంగా సహకరిస్తే ఇప్పుడు తనకే వెన్నుపోటు పొడుస్తారా అని అనుచరుల వద్ద రగిలిపోతున్నారు సీఎం రమేష్ .ఇటీవల ప్రొద్దుటూరులో సీఎం రమేష్ ఇప్తార్ విందుకు మంత్రి ఆదినార‌య‌ణ‌రెడ్డి హాజ‌రుకాలేదు.

{loadmodule mod_custom,GA2}

ఆదినారాయణరెడ్డి వెన్నుపోటు తర్వాత సీఎం రమేష్ తిరిగి రామసుబ్బారెడ్డి వర్గీయులకు మద్దతు తెలుపుతున్నారని చెబుతున్నారు. ఈ రాజకీయం గమనిస్తున్న మిగిలిననేతలు మాత్రం… వైసీపీకే వెన్నుపోటు పొడిచి వచ్చిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు సీఎం రమేష్‌కు వెన్నుపోటు పొడిస్తే ఆశ్చర్యపోవాల్సిందేముందంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}lZp_yaJjkgM{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -