Sunday, May 5, 2024
- Advertisement -

బావ‌ను పిల‌వ‌కున్నా బామ్మర్దిని పిలిచారు చాలు

- Advertisement -
  • తెలుగు మ‌హాస‌భ‌ల్లో బాల‌కృష్ణ‌
  • సంతృప్తిలో ఏపీ సీఎం చంద్ర‌బాబు

తెలంగాణ ప్ర‌భుత్వం అట్ట‌హాసంగా ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ఐదు రోజుల పాటు నిర్వ‌హిస్తోంది. అయితే ఈ మ‌హాస‌భ‌ల‌కు ప‌క్క రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఏపీలో మాట్లాడే భాష తెలుగు కాదా అని సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఎవ‌రెన్ని ప్ర‌శ్నించినా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవ‌రి మాట విన‌డు క‌నుక ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. క‌నీసం ఏపీ ముఖ్య‌మంత్రి, త‌న పాత స్నేహితుడు చంద్ర‌బాబు నాయుడును కూడా పిల‌వ‌క‌పోవ‌డం మ‌రింత విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఇంత జ‌రుగుతున్నా చంద్రబాబు మాత్రం కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి విహారానికి మాల్దీవుల‌కు వెళ్లాడు. అయితే చంద్ర‌బాబుకు మాత్రం కొంత ఊర‌ట‌నిచ్చే విష‌యం ల‌భించింది.

Prapancha Telugu Mahasabhalu
Prapancha Telugu Mahasabhalu

త‌న‌ను తెలుగు మ‌హాస‌భ‌ల‌కు పిల‌వ‌కున్నా త‌న బామ్మ‌ర్ది, సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌ను పిలిచార‌ని సంబ‌ర‌ప‌డుతున్నాడు. సోమ‌వారం తెలుగు సినీ ప్ర‌ముఖుల‌తో సినీ విభావ‌రి తెలుగు మ‌హాస‌భ‌ల్లో నిర్వ‌హించారు. ఈ స‌భ‌ల‌కు హిందూపూర్ ఎమ్మెల్యే, చంద్ర‌బాబు బామ్మ‌ర్ది, సినీ న‌టుడు బాల‌కృష్ణ హాజ‌ర‌య్యారు. గోధుమ రంగు పంచ‌క‌ట్టుతో తెలుగు సంప్ర‌దాయంలో బాల‌కృష్ణ ఆక‌ట్టుకున్నారు. బావ రాకున్నా బామ్మ‌ర్ది వ‌చ్చాడులే అని స‌భ‌ల్లో ప్రేక్ష‌కులు గుస‌గుస‌లు చేసుకున్నారు.

Prapancha Telugu Mahasabhalu
Prapancha Telugu Mahasabhalu

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -