Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీనుంచి కాదుకాదు….తెలుగు ప్ర‌జ‌ల‌నుంచి పివి ప్ర‌ధాని

- Advertisement -
Nara Lokesh tongue slip again in P V Narasimha Rao birth anniversary

ఏపీ ఐటీ మంత్రి లోకేష్ గురించి ఎంత‌చెప్పినా త‌క్కువే.ఆయ‌న ప్ర‌తీభాపాట‌వాలు ఏపాటివే తెలుగు ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే. గ‌తంలో ఆనాలోచితంగా మాట్లాడి సోషియ‌ల్ మీడియాలో ప‌రువు పోగొట్టుకున్న లోకేష్‌కు ఇంకా మార్పురాలేదు.పివి జ‌యంతి రోజు మ‌రో సారి ప‌ప్పులో కాలేశారు .

తన ప్రసంగాల్లో అప్పుడప్పుడూ తడబడి విమర్శలు కొని తెచ్చుకునే ఏపీ పంచాయతీ రాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్ మరోసారి అదే పని చేసి మీడియాకు చిక్కారు. ఈ ఉదయం పీవీ నరసింహరావు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, తెలుగుదేశం పార్టీ నుంచి పీవీ ప్రధాని అయ్యారని నోరు జారారు. ఆ వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన తెలుగు ప్రజల నుంచి పీవీ ప్రధాని పదవిని అలంకరించారని క‌వ‌రింగ్ ఇచ్చుకున్న‌రు. గతంలో అంబేద్కర్ జయంతి రోజును వర్థంతిగా పేర్కొని, పల్లెల్లో తాగునీటి సౌకర్యం లేకుండా చేస్తానని మరోసారి నోరు జారిన సంగతి తెలిసిందే.

{loadmodule mod_custom,GA1}

అయితే ఈసారి ఇంకొంచెం ముందుకెళ్లిన నారా లోకేశ్‌ …..మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేతను తమ పార్టీ నుంచి ప్రధాని అయ్యారని వ్యాఖ్యలు చేసి మళ్లీ అభాసుపాలు అయ్యారు.దీంతో లోకేష్ తప్పుల జాబితాలో మరో తప్పు చేరినట్లయింది. యథావిధిగా ఆయన ప్రత్యర్థులు ఇప్పుడు దీన్ని హైలైట్ చేసి కౌంటర్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.
గ‌తంలో అనాలోచితంగా మాట్లాడి లోకేష్‌నుప్రత్యర్థి వర్గాలు కూడా దాన్ని బాగానే ఉపయోగించుకున్నాయి. మరిప్పుడు పీవి విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయో!.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}lMP1gC3tip4{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -