Monday, May 20, 2024
- Advertisement -

2018 – 19 వార్షిక బ‌డ్జెట్ – ముఖ్యాంశాలు

- Advertisement -

పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం…. 2018-19 బడ్జెట్‌ అంచనా రూ.21.57లక్షల కోట్లు. ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంటుందని అంచనా. 2017 – 18 బడ్జెట్ – రూ.21.54 లక్షల కోట్లు. 2017 – 18. సవరించిన బడ్జెట్ – రూ. 21. 54 లక్షల కోట్లు. 2017 – 18 లో జీడీపీలో ద్రవ్యలోటు – 3.5 శాతం. 2018 -19 లో జీడీపీలో ద్రవ్యలోటు – 3.3 శాతం.

18 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నులు….. 11 శాతం పెరిగిన వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు…. వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటుల్లో మార్పులేదు… టాక్స్ పేయర్ల సంఖ్య 8.72 కోట్లకు పెరిగింది… వ్యక్తిగత ఆదాయపన్నులో 40 వేలు స్టాండర్డ్ డిడక్షన్

• పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
• సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చాం
• పేదరిక నిర్మూలను హామీ ఇచ్చాం
• మేం అధికారంలోకి వచ్చేసరికి అవినీతి పేరుకుపోయింది
• 2014 వరకు విధాన లోపంతో దేశం నష్టపోయింది
• మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని పూర్తిగా మార్చాం
• ఇప్పుడు సహజ వనరులను పారదర్శకంగా కేటాయిస్తున్నాం
• నిజాయితీ, పారదర్శక విధానాల వల్ల మార్పులు వచ్చాయి
• విదేశీ పెట్టుబడులు పెరిగాయి
• గత కొన్నేళ్లుగా తెస్తున్న సంస్కరణలు ఇప్పుడు ఫలితాలిస్తున్నాయి
• మోదీ సంస్కరణలతో భారత వృద్ధి రేటు ఊపందుకుంది
• తొలి మూడేళ్లలో సగటున 7.5 వృద్ధి రేటు సాధించాం
• కొత్త సంస్కరణలతో అవినీతి తగ్గించే అవకాశం లభించింది
• డిజిటలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ఏర్పడింది
• బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణ కొత్త సంస్కరణలకు నాంది పలికింది
• వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రధానంగా దృష్టి
• వచ్చే ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా
• ప్రస్తుతం భారత్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ
• భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలబడింది
• తయారీ రంగం వృద్ధి తిరిగి పట్టాలెక్కింది
• ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది
• త్వరలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఐదో ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఏర్పడబోతోంది.
• 7 శాతం వృద్ధి సాధ్యమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ప్రకటించింది
• ఆ బడ్జెట్ లో వ్యవసాయం, ఆరోగ్యము, విద్య, సంక్షేమం పై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నాం
• తయారీ రంగం 8 శాతం వృద్ధి రేటు దిశగా అడుగులేస్తోంది
• దేశ వ్యాప్తంగా ఆ 3వేల జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసాం
• సౌభాగ్య పథకంతో లక్ష కుటుంబాల్లో వెలుగులు నింపాం
• విద్యకు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇస్తున్నాం
• రెండ్రోజుల్లో పాస్ పోర్ట్ మంజూరు, ఒక్కరోజులోనే కంపెనీ రిజిస్ట్రేషన్ మన విజయాలు
• ప్రత్యక్ష పన్నుల రాబడి ప్రయోజనం పేదలకు దక్కుతుంది
• నగదు బదిలీ పథకంతో ప్రపంచానికి భారత్ కొత్త విజయ పాఠం నేర్పుతోంది
• నగదు బదిలీతో మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడంతో అవినీతి తగ్గిపోయింది
• ధాన్యం, పప్పు దినుసుల మద్దతు ధర ఒకటిన్నర రెట్లు పెంచాం
• మార్కెట్ ధర తక్కువగా ఉన్నా రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం
• మార్చి నాటికి 585 మార్కెట్లకు ఈనామ్ కు అనుసంధానం
• 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు
• రూ.2 వేల కోట్ల కార్పస్ ఫండ్ తో వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధి
• ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం
• 2022 నాటికి అన్ని గ్రామాలకు పక్కా రహదారుల నిర్మాణం
• 2017- 18లో ఎగుమతులు 17 శాతం ఉన్నాయి
• వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సరళీకరణ
• సేంద్రీయ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం
• దేశవ్యాప్తంగా ఆహారశుద్ధి, వాణిజ్యశాఖలతో కలిసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్ల ఏర్పాటు
• ఆహారశుద్ధి రంగానికి రూ.1400 కోట్లు కేటాయించాం
• గ్రీన్ క్లస్టర్ల కోసం రూ.500 కోట్లు కేటాయించాం
• రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు
• పాడి రైతులు, ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు
• పశుసంవర్ధక, ఆక్వా పరిశ్రమల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
• సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నాం
• సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం
• రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం
• 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంతో ఉన్నాం
• పలు పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందజేస్తున్నాం
• రైతుల ఉత్పాదకత పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం
• వ్యవసాయం లాభసాటిగా మారాలి
• రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు
• దేశరాజధానిలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు
• దేశంలో పేదలకు స్వచ్ఛభారత్ అభియాన్ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది
• మహిళా హుందాతనాన్ని కాపాడటంలో శౌచాలయాల నిర్మాణం తోడ్పడుతుంది
• దేశరాజధానిలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక పథకం
• 2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి సొంతిల్లు
• 2019 నాటికి మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల రుణాలు
• వెదురు పరిశ్రమ ప్రోత్సాహం కోసం రూ.1290 కోట్లు
• నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు
• జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ.5,750 కోట్లు
• విద్యావ్యవస్థలో ప్రమాణాలు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయి
• ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందించే అవకాశం …అందుకోసమే ఇంటిగ్రేటెడ్ బీఈడీని తీసుకొని వస్తున్నాం
• ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డు నుంచి డిజిటల్ బోర్డు బోధనగా మార్పు
• గిరిజన ప్రాంతాల్లో ‘‘ఏకలవ్య’’ ఆదర్శ పాఠశాలల ఏర్పాటు
• విద్యాభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమం
• వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు
• గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.14.34 లక్షల కోట్లు
• 10 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల మేర వైద్యం ఉచితం
• 50 కోట్ల మంది జనాభాకు ఈ పథకం ద్వారా లబ్ధి
• ప్రతి మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక వైద్య కళాశాల, ఆస్పత్రి
• ప్రతి ఒక్కరికి రూ.330 ప్రీమియంతో రూ.5 లక్షల బీమా
• అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఒకే యంత్రాంగం ఏర్పాటు
• గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ. 2000 కోట్లు
• ఫర్ ఫ్యూమ్స్, ఆయిల్స్ కోసం రూ. 200 కోట్లు
• పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ. 1400 కోట్లు
• ఆఫరేషన్ గ్రీన్ కోసం రూ. 500 కోట్లు
• 42 మెగా పుడ్ పార్కులను పటిష్టం చేస్తాం
• రైతుల నుంచి సోలార్ పవర్ ను కొనుగోలు చేసే చర్యలు చేపడతాం
• డెయిరీ, ఫిషరీ కోసం రూ. 10 వేల కోట్లు
• ఉజ్వల పథకంలో 8 కోట్ల మంది పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు
• ప్రధాని సౌభాగ్య పథకం కింద 4 కోట్ల మందికి విద్యుత్ కనెక్షన్లు
• సౌభాగ్య పథకానికి రూ. 16 వేల కోట్లు
• మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 75 వేల కోట్లు
• 10 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్
• 50 కోట్ల మంది వినియోగదారులకు లాభం
• 2018-19లో వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు
• టీబీ పేషెంట్ల సంక్షేమం కోసం రూ. 600 కోట్లు
• ప్రజలందరీ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పథకం
• ఆయుష్మాన్ భారత్ ఫథకం కింద 1.5 లక్షల వెల్ నెస్ సెంటర్లు
• ఆరోగ్య రక్షణకు జాతీయ ఆరోగ్య విధానం
• ప్రతి పౌరునికి సమీపంలో వెల్ నెస్ సెంటర్
• వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.1200 కోట్లు
• నమామి గంగా ద్వారా గంగా ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది
• గంగా ప్రక్షాళన కార్యక్రమం ద్వారా 187 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి
• ఎస్సీల సంక్షేమం కోసం రూ.56 వేల కోట్లు
• ఎస్టీల సంక్షేమం కోసం రూ.39 వేల కోట్లు
• ఎంఎస్ఎంఈలకు బ్యాంకుల నుంచి ఆన్ లైన్ ద్యారా రుణాల మంజూరు
• 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.3 వేల కోట్ల మేర ముద్రా రుణాలు
• ఫిన్ టెక్ కంపెనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు
• చిన్నమధ్యతరహా పరిశ్రమలకు ఎన్పీఏలకు సంబంధించి త్వరలో ప్రత్యేక విధానం
• ముద్రా పథకం కింద రుణాలు పొందినవారిలో 76 శాతానికిపైగా మహిళలే
• జీవనప్రమాణాల మెరుగుదలకు పైలట్ ప్రాజెక్టు కింద 115 జిల్లాలు ఎంపిక
• 306 కౌశల్ యోజన కేంద్రాలు ఏర్పాటు
• వస్త్ర పరిశ్రమ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు
• చేనేత, జౌళి రంగానికి రూ.7,500 కోట్లు
• మౌలిక సదుపాయాల రంగానికి రూ.9.4 లక్షల కోట్ల పెట్టుబడులు
• దేశంలో ఏటా క్షయవ్యాధితో మృతి చెందేవారి సంఖ్య పెరుగుతోంది. రూ.600 కోట్లతో క్షయ వ్యాధిగ్రస్తుల పోషకాహార పథకాన్ని ప్రవేశ పెడుతున్నాం
• కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్ 8.33 శాతం నుంచి 12 శాతానికి పెంపు
• పెంచిన ఈపీఎఫ్ మూడేళ్లపాటు అమలు, అన్ని రంగాలకు వర్తింపు
• పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ
• పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషి
• రైళ్లలో ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
• రైళ్లలో సీసీ టీవీలు, వైఫై సౌకర్యం ఏర్పాటు
• 482 నగరాలకు క్రెడిట్ రేటింగ్
• రూ.5.35 లక్షల కోట్లతో సాగర్ మాలా రహదారుల అభివృద్ధి
• ముంబయి నగరంలో అర్బన్ రైల్వే వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ. లక్ష కోట్లు
• దేశవ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి
• క్రిప్టో కరెన్సీ వినియోగానికి ప్రభుత్వం నిరాకరణ
• క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం అంగీకరించదు
• ప్రతి వ్యాపార సంస్థకు ఒక ప్రత్యేక ఐడీ
• సులభతర వాణిజ్యంలో పారదర్శకత కోసం ప్రతి వ్యాపార సంస్థకు ప్రత్యేక గుర్తింపు
• సైనిక సంపత్తి, ఆయుధాల తయారీలో స్వావలంబనకు ప్రయత్నం
• ఆయుధాల తయారీ రంగంలో విదేశీ పెట్టబుడులకు ప్రోత్సాహం
• లక్ష గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు పూర్తి
• ఈ ఏడాది 5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు, 5 కోట్ల మందికి వైఫై సౌకర్యం
• రాష్ట్రపతి వేతనం రూ.5లక్షలకు పెంపు
• ఉప రాష్ట్రపతి వేతనం రూ.4 లక్షలకు పెంపు
• గవర్నర్ల వేతనం రూ.3.5 లక్షలకు పెంపు
• ప్రతి ఐదేళ్లకోసారి ఎంపీల వేతనం పెంపు
• రైల్వేల మూలధన వ్యయం రూ.1.48 లక్ష కోట్లు
• రైళ్లలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
• 18 వేల కి.మీ. రైల్వే లైన్ డబ్లింగ్
• ప్రత్యక్ష పన్నుల్లో 12.6 శాతం వృద్ధి
• గత రెండేళ్లుగా ఆదాయపన్ను వసూళ్లలో భారీ పెరుగుదల
• 85.51 లక్షలకు చేరుకున్న పన్ను చెల్లింపుదారులు
• 40 శాతానికి పెరిగిన పన్ను రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య
• సీనియర్ సిటిజన్లకు వైద్య ఖర్చులకు మరింత అదనపు రాయితీ
• సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు అదనపు రాయితీ రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు పెంపు
• విద్యాభివృద్ధి సెస్ 4 శాతానికి పెంపు
• మొబైల్ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
• మొబైల్ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20 శాతం పెంపు
• దిగుమతి చేసుకునే వస్తువులపై సామాజిక అభివృద్ధి సెస్ 10 శాతానికి పెంపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -