Wednesday, May 15, 2024
- Advertisement -

ఆర్డినెన్స్ జారీ

- Advertisement -

వైద్య విద్యార్ధులను కలవరపెట్టిన జాతీయ అర్హత పరీక్ష (నీట్) ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని కూడా కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని తీర్మానించారు.  నీట్ పరీక్షా విధానంపై దేశంలో అన్ని రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

దీంతో వీరి వొత్తడికి కేంద్రం తలవంచక తప్పలేదు. శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయిన కేంద్ర మంత్రి మండలి ఈ ఒక్క అంశంపైనే సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఒక్క ఏడాది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్దంగా నిర్వహించే పరీక్షలకు మినహాయింపు ఇవ్వాలని తీర్మానించారు. దీంతో మెడికల్ విద్యార్ధులకు ఊరట లభించినట్లు అయ్యింది. ఈ ఆర్డినెన్స్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా రాష్ట్రపతి దగ్గరకు తీసుకువెళ్తారు. నీట్ ను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ రాష్ట్రపతి ఆమోదాన్ని తీసుకుంటారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఆర్డినెన్స్ కు అనుమతిస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపసమనం కలుగుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ ద్వారానే ప్రయివేట్ మెడికల్ కళాశాలల్లో కూడా ప్రవేశాలు జరుగుతాయి. మరోవైపు కేంద్రం ఇచ్చే ఆర్డినెన్స్ పై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సంకల్ప్ ఛారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్చంధ సంస్ధ ప్రకటించింది. ఆర్డినెన్స్ వెలువడగానే కోర్టుకు వెళ్తామని ఆ సంస్ధ న్యాయవాది అమిత్ కుమార్ తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -