Saturday, May 18, 2024
- Advertisement -

బీజేపీ ఆశ నెరవేరాలంటే…!

- Advertisement -

2019లో తెలంగాణలో అధికారమే టార్గెట్ గా.. రాష్ట్రంపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. ఎన్నడూ లేని విధంగా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కొద్ది రోజుల వ్యవధిలోనే రీసెంట్ గా.. తెలంగాణలో రెండు సార్లు పర్యటించి.. రాష్ట్రంపై తన ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం కృషి చేయాలని పార్టీ వర్గాలకు దిశా నిర్దేశం కూడా చేశారు.

ఇంత వరకూ బాగానే ఉంది. కానీ.. బీజేపీ ఆశలు నెరవేరాలంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే.. పార్టీకి కీలకంగా ఉన్న ముగ్గురు నాయకుల వ్యవహారశైలి మారితేనే.. సాధ్యమన్న వాదన వినిపిస్తోంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికీ ఉన్న అభిప్రాయ భేదాలు.. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే స్పష్టంగా బయటపడ్డాయి. కనీసం ఎన్నికల ప్రచారంలో.. కిషన్ రెడ్డి ఫొటో కూడా లేకుండా చూసుకున్నారంటే.. దత్తన్నకూ ఆయనకూ మధ్య ఏ స్థాయిలో పట్టింపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక.. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా.. ఈ ఇద్దరికీ సమాన దూరం పాటిస్తూ పార్టీలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇదే నిజమైతే.. పార్టీకి మూలస్తంభంగా ఉన్న ముగ్గురు నేతలూ.. తలో దిక్కుగా ఉన్నట్టే లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం సాధ్యమేనా అన్న విషయం.. పార్టీ కేడర్ లో వినిపిస్తోంది. అందుకే.. ముగ్గురూ ఒక్కతాటిపైకి వస్తే.. మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో పెరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -