Saturday, May 18, 2024
- Advertisement -

పటేల్స్ కోసం దిగొచ్చిన ప్రభుత్వం

- Advertisement -

పటేళ్ల సామాజిక వర్గానికి ఇత‌ర వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తి వ‌ర్గ‌ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలంటూ గుజ‌రాత్‌లో తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మం చెల‌రేగిన విష‌యం విధిత‌మే. దీనిపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం దిగొచ్చింది. ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్ల‌పై కీలక నిర్ణ‌యాన్ని తీసుకుంది.

ప‌టేళ్లలో రూ.6ల‌క్ష‌ల ఆదాయం ఉన్న‌వారికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది. మే1 నుంచి ఆర్థికంగా వెన‌క‌బ‌డిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కానున్న‌ట్లు చెప్పింది. అయితే దీనిపై బీసీ సంఘ‌నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ప‌టేళ్ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే.. వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని మండిప‌డుతున్నారు.

మరోవైపు రిజ‌ర్వేష‌న్ల‌పై ప‌లు వ‌ర్గాలు ఇత‌ర రాష్ట్రాల‌లోనూ ఉవ్వెత్తున్న ఉద్య‌మాన్ని కొన‌సాగించిన విష‌యం తెలిసిందే. తాజాగా గుజ‌రాత్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంతో దీని ఫ‌లితం ఇత‌ర రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -