Saturday, April 27, 2024
- Advertisement -

థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్‌ తమిళ బాట?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీ సమేతంగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని శ్రీరంగనాథస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఐతే కేసీఆర్‌ స్వామివారి దర్శనానికి మాత్రమే వెళ్లారా.. స్టాలిన్‌తో ఎందుకు సమావేశం అవ్వుతున్నారు.. తమిళనాడు సీఎంతో సమావేశం వెనుక ఉన్న రహస్యం ఏంటి..

సీఎం కేసీఆర్‌ తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీరంగనాథ స్వామిని కేసీఆర్‌ దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్‌ రేపు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వరి రఘడ కొనసాగుతున్న సమయంలో కేసీఆర్‌ స్టాలిన్‌తో సమావేశం కావడం చర్చనీయంశంగా మారింది.

కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తుండటంతో కేసీఆర్ స్టాలిన్‌ మద్దతు కోరనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకవిధంగా ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలను ఒక విధంగా చూస్తున్నారని కేసీఆర్‌ తెలపనున్నారు. దీంతో పాటు మరో 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉండటంతో థర్డ్ ఫ్రంట్ పై సైతం కేసీఆర్‌ స్టాలిన్‌తో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రైతులను మోసం చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పడాని కేసీఆర్‌ ఎవ్వరితోనేనా కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి చెప్పడంతో దీనిపై చర్చ మరింత ఎక్కువైంది.

ఎన్నికల సమయంలో గుర్తురాని పవన్‌ ఇప్పుడు గుర్తుకొచ్చాడా ?

లోకేశ్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..?

అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -