Thursday, May 16, 2024
- Advertisement -

కేంద్రానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

- Advertisement -

నీటి పారుదల ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాలు వీధికెక్కుతున్నాయి. క్రష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మంత్రి హరీష్ రావు నాయకత్వంలో ఓ బ్రందాన్ని ఢిల్లీ పంపాలని తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

ఈ మేరకు హరీష్ రావు శనివారం నాడు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ కేంద్ర మంత్రి, క్రష్ణా బోర్డుకు ఈ అంశంపై ఫిర్యాదు చేస్తారు. ఇంతటితో పోరు ఆగితే సరేసరి లేకుంగా ఏకంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నాయకత్వంలో కొందరు నిపుణులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీనే కలవాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. క్రష్ణా నదిపై ప్రాజెక్టు రీ డిజైన్ చేయడం వల్ల 28 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేశారు.

ఇందులో ఆరు వేల కోట్ల రూపాయల పనులను పాత కాంట్రాక్టర్ కే అప్పగించినా.. మిగిలిన 22 వేల కోట్ల రూపాయల పనులకు మాత్రం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్ కు తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నది ఆ ప్రభుత్వ వాదన. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -