Saturday, May 18, 2024
- Advertisement -

టీఆర్ఎస్ ప్లీన‌రీ కోసం 9 క‌మిటీలు

- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటుచేసింది. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 27న హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్‌లో ప్లీనరీ నిర్వహించాలని సీఎం, టీఆర్ఎస్పా అధినేత  కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కమిటీల్లో ప్రధానంగా ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించారు.
ఈ ప్లీన‌రీతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న టీఆర్ఎస్ విజ‌య‌వంతానికి ప్ర‌త్యేక ప్లాన్ వేస్తోంది. ప్లీన‌రీ ద్వారా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌భావం చూపించాల‌నే ల‌క్ష్యంతో ఉన్న టీఆర్ఎస్ ఆ విధంగా ముందుకెళ్తోంది. ఇప్పుడు నియ‌మించిన 9 క‌మిటీల్లో మేడ్చ‌ల్‌, రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించారు.
ప్లీనరీ ఆహ్వాన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిలతో వేసింది. సభా ప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు పార్కింగ్, నగర అలంకరణ, వాలంటరీస్, భోజన కమిటీ, మీడియా కో ఆర్డినేటర్స్, సాంస్కృతిక కమిటీలకు బాధ్యులను నియ‌మించారు. ఇప్పటికే ఆరుగురితో తీర్మాణాల కమిటీని ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరుగుతున్న ఐదో ప్లీనరీ. ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రతినిధులు 12 నుంచి 15 వేల మంది హాజరుకానున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం వంద మంది వరకు ఆహ్వానిస్తున్నారు. ప్లీనరీకి మండల, మున్సిపల్ పై స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ ప్రతినిధులు రానున్నారు.
తెలంగాణ వంటకాలతో నోరూరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి. ప్లీనరీకి ఆహ్వానితులైన ప్రతినిధులు ఏప్రిల్ 27వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటల‌కల్లా ప్రాంగణానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్‌ రెడ్డి తెలిపారు.
ప్లీనరీ నిర్వహణ కమిటీలు
ఆహ్వాన కమిటీ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి
సభా ప్రాంగణం, వేదిక : టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ప్రతినిధుల నమోదు, పార్కింగ్ : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే సీహెచ్ కనకారెడ్డి
నగర అలంకరణ : జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్
వలంటీర్ల కమిటీ : ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ ఉప‌ మేయర్ బాబా ఫసీయుద్దీన్, టీఎస్‌టీఎస్సీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్
భోజన కమిటీ : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
మీడియా కో-ఆర్డినేటర్స్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
సాంస్కృతిక కమిటీ : రాష్ట్ర సాంస్కృతిక వారథి చైర్మన్ రసమయి బాలకిషన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -