Wednesday, May 15, 2024
- Advertisement -

పైలెట్‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి…పాక్‌కు భార‌త్ అల్టిమేట్టం

- Advertisement -

భార‌త్‌, పాక్ మ‌ధ్య యుద్ద మేగాలు తీవ్ర స్థాయికి చ‌రే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఒక వైపు శాంతి అంటూనే పాక్ యుద్ద స‌న్నాహ‌కాల్లో మునిగి తేలుతోంది. స‌రిహ‌ద్దుల‌కు పాక్ భారీగా యుద్ద‌ట్యాంకుల‌ను, ఆయుధాల‌ను త‌ర‌లిస్తోంది. ఇక పాక్ అధీనంలో ఉన్న ఫైలెట్‌ను త‌క్ష‌ణ‌మే భేష‌రుతుగా విడుద‌ళ చేయాల‌ని భార‌త్ మ‌రో సారి డిమాండ్ చేసింది. పైలెట్ అప్ప‌గింత‌పై పాక్‌తో ఎలాంటి డీల్ లేవ‌ని తేల్చి చెప్పింది. పాక్ తమ వద్ద ఉన్న పైలట్‌ను భారత్‌కు అప్పగించడానికి మెలికలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. పాక్ డిమాండ్లకు తలొగ్గేది లేదని భారత అధికారులు చెబుతున్నారు.

ముంబై, పఠాన్‌కోట్‌లపై దాడుల సమయంలోనూ పాకిస్థాన్‌కు పూర్తి ఆధారాలు ఇచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందువల్ల ఈసారి అలాంటి ఆధారాలేవీ పాక్‌కు ఇచ్చే ప్రసక్తే లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకున్నాం. వాటికి సంబంధించిన ఆడియోలూ ఇచ్చాం. అయినా పాకిస్థాన్ మాత్రం నిరాకరిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పుల్వామాలో జైషే మహ్మద్ పాత్రను పాక్ అంగీకరించడం లేదు అని భారత్ అభిప్రాయపడింది.

రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గించ‌డానికి భార‌త్ చ‌ర్చ‌ల‌కు రావాల‌ని పాక్ స్ప‌ష్టం చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తే అభినందన్‌ను ఇండియాకు అప్పగించడానికి సిద్ధమని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహముద్‌ ఖురేషి తెలిపారు. అయితే.. పాక్‌తో ఎలాంటి చర్చలు, ఒప్పందాలకు భారత్ సిద్ధంగా లేనట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -