Monday, May 13, 2024
- Advertisement -

ఏపీపై మోడీ కక్ష మరోసారి బట్టబయలు

- Advertisement -

విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చేయండి. మాకెలాంటి అభ్యంతరాలు లేవని పార్లమెంట్ స్థాయిసంఘం ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు ఒడిషా రాష్ట్రానికి చెందిన సీనియర్ ఎంపీ ప్రసన్న కుమార్ పట్సానీ. బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్న బిజూ జనతాదల్ పార్టీకి చెందిన ఆయన పార్లమెంటు స్థాయి సంఘం ముందు తమ రాష్ట్రం తరఫున మాట్లాడారు. విశాఖఫట్నం మంచి నగరం, శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆ నగరానికి రైల్వేజోన్ ఇస్తే మా రాష్ట్రానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఆ నగరం కూడా భారతదేశంలో భాగమే కదా. మాకు పొరుగునే ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక రైల్వో జోన్ ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని కుండబద్ధలు కొట్టినట్లు తేల్చేశారు. కొత్త జోన్ ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ వద్ద నిధులు పుష్కలంగా ఉన్నాయి. మరి జోన్ ఏర్పాటుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ? మీకు ఏంటి అభ్యంతరం ? అని స్థాయి సంఘం సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులను అందరి ముందు ఎంపీ ప్రసన్న కుమార్ పట్సానీ నిలదీశారు. ఏపీ పునర్విభజన చట్టం అమలుపై గురువారం పార్లమెంటు భవనంలోని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో పార్లమెంటు స్థాయీసంఘం సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో 13 కేంద్ర మంత్రిత్వశాఖల అధికారులు సహా ఏపీ, ఒడిషాకు చెందిన పులవురు ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖకు కొత్త రైల్వేజోన్‌ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రసన్న కుమార్‌ పట్సానీ, ఒడిషా కానీ, బిజూ జనతాదళ్ కానీ విశాఖ రైల్వేజోన్‌ను వ్యతిరేకించడంలేదని స్పష్టం చేశారు.

వెంటనే టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒడిశా రాష్ట్రానికి అభ్యంతరాలు లేవని తేలిపోయింది, విశాఖలో కొత్త రైల్వోజోన్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని వాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి మీరెందుకు ఏర్పాటు చేయట్లేదని రైల్వే అధికారులను నిలదీశారు. దీనిపై రైల్వేజోన్‌ ఆర్థికంగా లాభదాయకం కాదని నివేదిక వచ్చిందని, రైల్వే శాఖ డైరక్టర్‌ స్థాయి అధికారులు చెప్పుకొచ్చారు. అయినా రైల్వేశాఖ మంత్రి దానిపై కసరత్తు చేస్తున్నారని వివరణ ఇచ్చి, బంతిని మళ్లీ రైల్వే మంత్రి కోర్టులోకి నెట్టేశారు. ఈ అంశంతో మరోసారి మోడీ ప్రభుత్వం చేస్తున్నకుట్రలు బహిర్గతమయ్యాయి. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే పొరుగునే ఉన్న తమిళనాడు, తెలంగాణ కూడా అడుగుతున్నాయి. అందుకే ఇవ్వలేకపోతున్నాం అని బీజేపీ పెద్దలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు విశాఖకు రైల్వో జోన్ ఇస్తే పొరుగునే ఉన్న ఒడిషా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వాళ్లు అంగీకరించడం లేదు. అందుకే పని జరగడం లేదు అని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షమే అయిన బిజు జనతాదల్ సీనియర్ ఎంపీ ప్రసన్న కుమార్ మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పేయడంతో బీజేపీ దొంగ నాటకం మరోసారి బయటపడిపోయింది. వీళ్లే ఏపీకి ద్రోహం చేస్తూ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఒడిషాలపై నెపం నెట్టేస్తున్నారని అర్ధమైపోయింది. మరి దీనిపై వైఎస్ఆర్ సీపీ, జనసేన ఎలా స్పందిస్తాయో…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -