Saturday, May 18, 2024
- Advertisement -

సిగ్గులేకే చిరంజీవి కాంగ్రెస్ లో కొనసాగుతున్నారా ?

- Advertisement -

రాత్రికిరాత్రే జాతీయ స్థాయి సంచలనమైపోయిన వివాదాల శ్రీరెడ్డి తగ్గేది లేదంటోంది. పవన్ కళ్యాణ్ అయితే ఏంటి ? ఆయన అభిమానులు అయితే ఏంటి ? నేనింతే.. నాకు సమాధానం చెప్పాలంతే…అని మళ్లీ పవన్ ను కెలికేసింది. పదహారేళ్లు చాలా అల్లారుముద్దుగా, ప్రేమగా పెంచుకున్న తన అన్న కుమార్తె శ్రీజను కాంగ్రెస్ నాయకులు చాలా మోసపూరితంగా ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు కూర్చోబెట్టారని ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అవసరాల కోసం వాళ్లు అలా చేయడంతో మా కడుపు మండిపోయిందని పవన్ ఆగ్రహంతో ఊగిపోయారు. 11 ఏళ్ల క్రితం, అంటే 2007 అక్టోబర్ లో చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ శిరీశ్ భరద్వాజ్ అనే కుర్రాడిని ప్రేమించి పెళ్లాడింది.

ఆ లవ్ మ్యారేజ్ ఆంధ్రాతో పాటు ఢిల్లీ స్థాయిలోనూ పెద్ద సంచలనమయింది. ప్రముఖ టీవీ చానెల్ తన డిఎస్ఎన్ జీ వ్యానులో శ్రీజ, శిరీశ భరద్వాజ్ దంపతులను హైదరాబాద్ అంతటా తిప్పుతూ లైవ్ కవరేజ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ జంట ఢిల్లీ చేరుకుంది. తమ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని శ్రీజ ఓ వైపు నేషనల్ మీడియాను, మరోవైపు కోర్టును ఆశ్రయించింది. అప్పుడే పవన్ కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కామన్ మ్యాన్ కు రక్షణ కల్పించడమే ఆ ఫోర్స్ లక్ష్యమని సెలవిచ్చారు. కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించారు. ఆ తర్వాత కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్, ఆ కోటి రూపాయలు ఏమయ్యాయో… పవన్ కే తెలియాలి. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే.. నాటి గతాన్ని గుర్తు చేసుకుంటూ నాటి కాంగ్రెస్ నాయకులు తమ బిడ్డను, తమ ఇంటి పరువును బజారుకీడ్చారని ఇటీవల పవన్ మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా శ్రీరెడ్డి మళ్లీ స్పందించింది. మీ బిడ్డను బజారుకీడ్చి, మీ ఇంటి పరువు రోడ్డు పాల్జేస్తే…ఇంకా మీ అన్న చిరంజీవి ఎందుకు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని ప్రశ్నించింది. ఆయన అభిమానుల ద్వారా రేపు మీకు ఓట్లు వేయించేందుకు పాటుపడుతున్నారా ? అని నిలదీసింది. ఓ వైపు కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ ఇంకా ఆ పార్టీలో కొనసాగడానికి మీ అన్న సిగ్గు పడటం లేదా ? అన్నం పెట్టేవాడికి సున్నం వేస్తారా ? అంటూ శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని కడిగేసింది.

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో కలకలం రేపిన శ్రీరెడ్డి మరోవైపు రోజుకొకరిని టార్గెట్ చేసినట్టుంది. తాజాగా నటుడు, దర్శకుడు లారెన్స్ ను కూడా రచ్చలోకి లాగింది. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న గోల్కొండ హోటల్ లో చాలా రోజుల క్రితం అవకాశాల కోసం తాను లారెన్సును కలిశానని చెప్పింది. ముందు తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చిన లారెన్స్, ఆ తర్వాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. అయినా అవకాశమిస్తానని ఆయన చెప్పడంతో కొన్నాళ్లు స్నేహంగా ఉన్నాను అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. కానీ బెల్లంకొండ సురేష్ తమ మధ్య బంధానికి విలన్ అయ్యాడని ఆక్రోషం వెళ్లగక్కింది. అన్నట్టు రెండు రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు మురుగదాస్ పై కూడా శ్రీరెడ్డి ఇలాంటి ఆరోపణలే చేసింది. హాయ్ మురుగుదాస్.. గ్రీన్ పార్క్ హోటల్ గుర్తుందా…అంటూ ట్వీట్ చేసింది. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ ద్వారా మన పరిచయం జరిగింది కదా అని గుర్తు చేసింది. గ్రీన్ పార్క్ హోటళ్లో మనం చాలా….అంటూ ఏదో గోప్యత ప్రదర్శించింది. అయినా మురుగదాస్ తనకు చాన్స్ ఇవ్వలేదని బాంబ్ పేల్చింది. ఇప్పటికే అనేకమంది టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఆరోపణలు ఆగేదెప్పుడో ? అడ్డుకట్ట వేసేదెవ్వడో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -