Saturday, May 18, 2024
- Advertisement -

ప్ర‌యాణీకుల ప్రాణాల మీద‌కు తెచ్చిన జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది నిర్ల‌క్ష్యం

- Advertisement -

జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది నిర్ల‌క్ష్యం ప్ర‌జ‌ల ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న విమానంలో క్యాబిన్ ప్రెజర్ పడిపోవడంతో.. ప్రయాణికుల ముక్కు, చెవుల నుంచి రక్తం కారింది. విమాన క్యాబిన్‌లో ఎయిర్ ప్రెజర్‌ను నియంత్రించడం సిబ్బంది మర్చిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో వెంటనే అత్యవసర ఆక్సిజన్‌ మాస్క్‌లను ప్రయాణికులు ధరించాల్సివచ్చింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 166 మంది ప్రయాణికులు ఉన్నారు.

అస్వస్థతకు గురైన ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే చికిత్స అందించారని అధికారులు తెలిపారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వెంటనే విమానాన్ని ముంబై మళ్లించి చికిత్స ప్రయాణికులకు చికిత్స అందించారు. విమానం టేకాఫ్ సమయంలో పైలెట్ బ్లీడ్ స్విచ్ నొక్కడం మర్చిపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. వెంటనే ఆక్సిజన్ మాస్కుల కిందకు వచ్చేయడంతో… వాటి సాయంతో ప్రయాణికులు శ్వాస తీసుకునే ప్రయత్నం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -