Monday, May 20, 2024
- Advertisement -

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్ర‌యివేటీక‌రించ‌ద్దు….

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై మ‌రో సారి గ‌లం విప్పారు. విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ను ప్రైవేటీకరించటాన్ని ప‌వ‌న్ వ్య‌తిరేకించారు. డిసిఐని ప్రైవేటీకరించేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్దం చేసింది. అందుకు నిరసనగా వెంకటేశ్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రోజుల ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా డిసిఐని ఉద్యోగులు చేస్తున్న దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌ధాని మోదీకి ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఎటువంటి లేఖ రాయ‌లేద‌ని మొద‌టి సారిగా (డిసిఐ)ను ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకిస్తూ జ నరేంద్రమోడికి లేఖ రాసారు. వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వ‌ప‌న్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు.

2014 ఎన్నిక‌ల దగ్గర నుండి ఇప్పటి వరకూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని కలిసి తనకు వ్యక్తిగతంగా అది కావాలి, ఇది కావాలంటూ ఎప్పుడూ కలవలేదన్నారు. ప్రధానిని కలవటానికి తాను కనీసం ప్రయత్నం కూడా చేయలేదన్నారు. వ్యక్తిగత సమస్యలకన్నా ప్రజా సమస్యల పరిష్కారంపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పారు.

నష్టాల్లో ఉన్న సంస్ధలను ప్రైవేటీకరించారన్నా అర్ధముందన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల నుండే డిసిఐకు కోట్లాది రూపాయల బకాయిలు రావాల్సుందన్నారు. కొన్ని వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్ధను కేంద్రం ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవ‌డం దారున‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా మోదీకి రాసిన లేఖ‌ను ప‌వ‌న్ మీడియాకు చూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -