- Advertisement -

తీన్మార్ మల్లన్న అనుచరుడిపై పీడీ యాక్ట్

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భారీ ధాన్యం పక్కదారి కేసులో సూర్యాపేట జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ మరియు పోలీసు అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. TRP (టిఆర్‌పి) పార్టీ జనరల్ సెక్రటరీ, తీన్మార్ మల్లన్నకు అత్యంత సన్నిహితుడు వట్టె జానయ్య యాదవ్‌పై ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ (పీడీ యాక్ట్) నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని ‘వజ్ర రైస్ కార్పొరేషన్’, ‘వజ్ర వికాస్ రైస్ మార్ట్’ మిల్లులలో ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయింది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 29,188 టన్నుల ధాన్యాన్ని (రూ. 73 కోట్ల విలువైన) వట్టె జానయ్య యాదవ్ కాజేసి, అక్రమంగా విక్రయించినట్లు విచారణలో ఆధారాలు లభించాయి.

ఈ భారీ కుంభకోణంలో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తున్న పలు లారీలను పోలీసులు సరిహద్దుల్లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.బాలెంల పరిధిలోని రెండు రైస్ మిల్లులను అధికారులు సీజ్ చేసి, అక్కడ ఉన్న ధాన్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో ప్రమేయం ఉన్న వట్టె జానయ్య యాదవ్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కుంభకోణం బయటపడటంతో మరియు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడంతో ప్రధాన నిందితుడైన వట్టె జానయ్య యాదవ్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ప్రభుత్వ సొమ్మును, రైతుల ధాన్యాన్ని దోచుకున్న వారిపై ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -