Sunday, May 19, 2024
- Advertisement -

అబార్ష‌న్ చేయించిన త‌ల్లిదండ్రులు..చివ‌ర‌కు అమ్మాయి ఏమ‌య్యింది..?

- Advertisement -
Person fraud Tribal Handicap girl in khammam

ప్ర‌పంచంలో మ‌హిళ‌లు అన్ని రంగాల‌లో దూసుకుపోతున్నా… ఇంకా అన్యాయం జ‌రుగుతూనే ఉంది.ఆధునిక యుగంలో కూడా అమ్మాయిల శీలానికి ఖ‌రీదు క‌డ్తున్నారు కుల పెద్ద‌లు.గిరిజన వికలాంగ బాలికను గర్భవతిని చేసి, పెళ్లికి నిరాకరించిన మోసగాడిని ఆ గ్రామ పెద్దలు వదిలేశారు.

బదులుగా, ఆమె శీలానికి వెల (నష్ట పరిహారం) నిర్ణయించారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజర గ్రామానికి చెందిన వికలాంగురాలు వాంకుడోత్‌ రాణి(15)కి, అదే గ్రామానికి చెందిన మూడు చెన్న కేశవులు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబ‌ర్చుకున్నాడు. కొన్నాళ్లకు అమె ఆమె గర్భందాల్చింది. ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దల ద్వారా పంచాయతీ పెట్టించారు. రాణిని చెన్నకేశవులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీనికి అతడి తల్లిదండ్రులు నిరాకరించి, నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధపడ్డారు. బాలిక కుటుంబానికి రూ.40వేలు చెల్లించేలా ఇరు కుటుంబాల మధ్య గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు.

{loadmodule mod_custom,GA1}

నిరుపేద‌ల‌యిన అమ్మాయి త‌ల్లిదండ్రులు దీనికి ఒప్పుకున్నారు.ఆమ్మాయిన మోసం చేసిని చెన్నకేశవుల తల్లి మూడు లచ్చి, ఖమ్మం తీసుకెళ్లి అబార్షన్‌ చేయించింది. నిరుపేదలైన బాలిక తల్లిదండ్రులు వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోలేదు. రెండు నెల‌ల త‌ర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి, ఖమ్మం ఆస్పత్రిలో మృతిచెందింది.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో 12మందిపై కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌ కేసు నమోదు చేశారు. అబార్షన్‌ చేసిన ఆసుపత్రి వైద్యులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.పేద‌రికాన్ని ఆస‌రా చేసుకొని శీలానికి ఖ‌రీదు క‌ట్టే సంఘ‌ట‌న‌లు అక్క‌డ‌క్క‌డ జ‌రుగుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}3keV7jgydrI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -