Sunday, May 19, 2024
- Advertisement -

మహిళలకు భద్రత కల్పించలేని పాలన

- Advertisement -

దేశంలో ఎన్డీఎ పాలన దారుణంగా ఉందని, ఈ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని, వీటిని నివారించేందుకు సరైన చట్టాలే లేవని ఆమె దుయ్యబట్టారు.

స్త్రీలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రియాంక చతుర్వేది ఓ వ్యాసం రాసారు. ఆ వ్యాసంలో ఆమె ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై విరుచుకుపడ్డారు. తనపై కూడా కొందరు నానా మాటలు అన్నారని, నిర్భయ తరహాలో రేప్ చేసి చంపుతామంటూ బెదిరించారని ఆమె చెప్పారు. నేను ప్రముఖ నాయకురాలిని.

నాకే ఇలాంటి బెదిరింపులు వస్తే సామాన్యుల పరిస్ధితి ఏమిటని ప్రియాంక చతుర్వేది అన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -