Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణ‌కు ఆర్‌బీఐ షాక్‌

- Advertisement -
తెలంగాణ ప్ర‌భుత్వానికి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. తెలంగాణ ప్ర‌భుత్వం అడిగినంత న‌గ‌దు ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పింది. ఇన్నాళ్లు తాము అడిగినంత పంపిణీ చేశామ‌ని ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం అడిగిన రూ.6 వేల కోట్ల న‌గదును అందించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.
ప్ర‌స్తుతం బ్యాంకులు, ఏటీఎంల్లో న‌గ‌దు లేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్‌బీఐని న‌గ‌దు అందించాల‌ని కోరింది. నోట్ల ర‌ద్దు నాటి ప‌రిస్థితులు ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఏర్ప‌డ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో రూ.6 వేల కోట్ల న‌గ‌దును అందించాలేమ‌ని తెలిపింది. వివిధ ప‌థ‌కాల అమలు కోసం కూడా తెలంగాణ ప్ర‌భుత్వం న‌గ‌దు స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించింది.
ఇప్ప‌టికే పింఛ‌న్లు న‌గ‌దు రూపంలో ఇస్తుండ‌గా ఇప్పుడు రైతుల‌కు ఇవ్వాల్సిన ప‌లు స‌హాయాల‌ను కూడా న‌గ‌దు రూపంలో ఇవ్వాల్సి రావ‌డంతో ఆర్‌బీఐని కేసీఆర్ ప్ర‌భుత్వం కోరింది. దీనికి ఆర్‌బీఐ సున్నితంగా ఇవ్వ‌లేమ‌ని చెప్పేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -