Friday, May 3, 2024
- Advertisement -

మళ్లీ ఉడికెత్తిస్తున్న ఎండలు

- Advertisement -

మూడు రోజులు వర్షాలు. గాలులు. ఎండలకు మాడిపోయిన ప్రజలు కాసింత సేద తీరారు. ఈ ఆనందం మళ్లీ ఆవిరైంది. గడచిన నాలుగు రోజులుగా ఎండలు మళ్లీ తమ ప్రతాపం చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు నానాటికి ముదురుతున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి.

మూడు రోజుల పాటు భారీ వర్షాలు, గాలులు వీచి కాసింత ఉపసమనం కలిగింది. ప్రస్తుతం వడగాలులు ప్రజలను భయపెడుతున్నాయి. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ వర్షాలు కురిసినా తెలంగాణలో మాత్రం ఎండలు దంచేసాయి. రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే ఇది రెండో స్ధానం. రానున్న రోజుల్లో మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఉపరితల ఆవర్తనం స్ధిరంగా ఉండడమే దీనికి కారణమని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. శనివారం నాడు నైరుతి అల్పపీడనం వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల 16న తీవ్రమైన వాయిగుండం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -