Monday, May 20, 2024
- Advertisement -

జ‌ల‌పాతంతో గ‌ల్లంతైన శాస్త్ర‌వేత్త సోమ‌శేఖ‌ర్ ..

- Advertisement -

కర్ణాటకలోని మైసూరు జిల్లా చుంచనకట్టె జలపాతంలో ఆదివారం ఓ శాస్త్రవేత్త కొట్టుకుపోయారు. ఈయనను సీనియర్‌ శాస్త్రవేత్త సోమశేఖర్‌ (40)గా గుర్తించారు. ఆయన కోసం గాలిస్తున్నారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. వీకెండ్ కావ‌డంతో విహార యాత్ర‌కు వెల్లిన అయ‌న జ‌ల‌పాతంలో గ‌ల్లంత‌య్యారు.

ఈ ఘ‌ట‌న చుంచనకట్టె జలపాతం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన్ను మైసూరులోని సీఎఫ్టీఆర్‌ఐలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. సోమశేఖర్‌తో అతని కుటుంబ సభ్యులు ఆదివారం చుంచనకట్టె జలపాతానికి వెళ్లారు. జలపాతం పైన ఉన్న ప్రవాహంలోకి వెళ్లి ఫొటోలు తీసుకుంటుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. దీంతో వారంతా జలపాతం మధ్యలో చిక్కుకున్నారు. స్థానికులు, పర్యాటకులు దుస్తులను తాళ్లుగా చేసి.. ముగ్గురిని రక్షించారు. సోమశేఖర్‌‌ను కూడా రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా.. అతను ఒక్కసారిగా అదుపుతప్పి జలపాతంలోకి జారిపోయారు.

జలపాతంలో గల్లంతైన సోమశేఖర్ కోసం స్థానికులు నదిలో గాలిస్తున్నారు. ఈ జలపాతం కావేరీ నదిలో ఉంది. దీనికి ఎగువన ఉన్న విద్యుత్తు యూనిట్‌కు నీటి సరఫరా నిలిపి, నదిలోకి వదలడంతో ఒక్కసారిగా జలపాతంలో నీటి ఉధృతి పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -