Monday, May 20, 2024
- Advertisement -

హైదరాబాద్ లో సెక్షన్ 8?

- Advertisement -

ఓటుకు నోటు హడావిడి జరిగిన తరుణం లో ‘సెక్షన్ 8’ గురించి ఎక్కడ చూసినా చర్చ సాగింది. తెలంగాణా రాష్ట్రము ఏర్పడిన కొత్తల్లో దీని గురించి మాట్లాడారు కానీ ఓటుకు నోటు కేసులో కెసిఆర్ తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు అంటూ తెలుగు దేశం మొత్తంగా ఈ సెక్షన్ 8 ని రంగంలోకి దింపింది.

హైదరాబద్ లో ఉంటున్న ఆంధ్రులకి రక్షణ లేకుండా పోతోంది అంటూ శాంతి బధ్రతలు గవర్నర్ కి ఇవ్వాలి అని అప్పట్లో బాగా డిమాండ్ లు వినిపించాయి తరవాత చంద్రబాబు ఏపీ కి వెళ్ళిపోవడం ఓటుకు నోటు కేసు కూడా వీగిపోవడం తో శాంతించారు జనాలు. అయితే గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో జరుగుతున్న కొట్లాటల దృష్ట్యా మళ్ళీ సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్నారు అందరూ. 

మజ్లిస్ పార్టీ వారు దాడులు చెయ్యడం, ఊహించని వారి తీరుకి అన్ని రాజకీయ పార్టీలూ ఆశ్చర్యానికి గురి అయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి ఇంటిమీద దాడి చెయ్యడం అంటే సామాన్య విషయం కాదు. ఇదంతా జరుగుతూ ఉన్నా తెరాస సైలెంట్ గా ఉంది అనీ శాంతి భద్రతలకి నష్టం వాటిల్లుతూ ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అని విమర్శలు వస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో సెక్షన్ను హైదరాబాద్లో అమలు చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో శాంతిభద్రతకు ఆటంకం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయనీ… అధికార పార్టీకి చెందినవారికే రక్షణ లేకుండా పోయిందనీ, ఇక ప్రతిపక్షాల వారికీ సామాన్య ప్రజలకూ భద్రత ఎలా ఉంటుందని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. సెక్షన్ 8 అమలు చేసి అధికారం తన చేతిలోకి తీసుకోవాలని గవర్నర్ కి పలువురు సూచిస్తున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -