Saturday, May 18, 2024
- Advertisement -

భారీ మెజార్టీతో గెలువనున్న తుమ్మల

- Advertisement -

తెలంగాణలోని పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జయకేతనం ఎగురవేయనున్నది. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేసినా అధికార టిఆర్ఎస్ ముందు దాసోహం అనక తప్పేట్లు లేదు. ఇక్కడ నుంచి పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు.

 టిఆర్ఎస్ విజయం వెనుక ప్రభుత్వ పథకాలతో పాటు స్ధానికంగా తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీకి తోడుగా టిడిపి కూడా నిలబడ్డా అతిమంగా గెలుపు మాత్రం టిఆర్ఎస్ ఖాతాలోనే పడేలా ఉంది. ఎన్నికల ముందే విజయం ఎవరిదో తేలిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ కు ముందే చేతులు ఎత్తేసిందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికార టిఆర్ఎస్ పై విరుచుకుపడింది.

ఎన్నికల సందర్భంగా అన్ని వ్యవస్ధలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఒక విధంగా టిఆర్ఎస్ ఓటర్లను భయపెట్టిందని ఆ పార్టీకి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తాము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకే ప్రజలు మెగ్గుచూపుతున్నారని, అందుకే తాము ఏ ఎన్నికల్లో అయినా గెలుస్తున్నామని చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -