Saturday, May 18, 2024
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వం రెండూ ప్రజల్ని మోసం చేస్తున్నాయి

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ విమర్శించారు.

ప్రత్యేక హాదా విషయంలో రాష్ట్రం, నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాయన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తవడానికి 16 వేల కోట్ల రూపాయిలు అవసరం అయితే కేంద్రం ఇచ్చే 250, 300 కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవదన్నారు.

ఒక్కో జిల్లా అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసారని అవి ఏ మూలకి వస్తాయన్నారు రామక్రిష్ణ. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన లోటు బడ్జెట్ ను అధిగమించడానికి కూడా కేంద్రం నిధులు ఇస్తామని చెప్పి 16 నెలలు గడిచినా ఇప్పటి వరకు వాటి ఊసేలేదన్నారు. సీఎం చంద్రబాబు మంత్రులతో కలిసి ప్రధాని మోడీని కలిసినా ఉపయోగం ఉండటం లేదన్నారు. తమకు సంతృప్తిగా ఉందని ముఖ్యమంత్రి బృందం చెబుతున్నా ప్రజలు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారన్నారు. 

ప్రత్యేక హాదా విషయాన్ని నీతి ఆయోగ్ సంస్థ పరిశీలిస్తుందని కేంద్రం చెప్పడం హాస్యాస్పదమన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తుందని మండి పడ్డారు. ముఖ్యమంత్రితో పాటు ఇంతమంది మంత్రులు, అధికార యంత్రాంగం ఉన్నా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టకుండా ఈవెంట్ మేనేజ్ మెంట్ ద్వారా ప్రవేటు వారికి కట్టబెట్టడం దారుణమన్నారు. మంత్రి పదవుల కోసం మాత్రం ప్రభుత్వం కావాలి పనులను మాత్రం ప్రవేటు వారికి అప్పగిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాదినేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రత్యేక హాదా డిమాండ్ ను సాధించాలన్నారు. అదే విధంగా విజయవాడలో శని, ఆది రెండు రోజుల పాటు జరిగే సీపీఐ కౌన్సిల్ సమావేశాలలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -