Tuesday, May 21, 2024
- Advertisement -

రెండు రోజుల న‌ష్టాల‌కు బ్రేక్‌…దూసుకెల్లిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -

రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్‌మార్కట్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాయి. ట్రేడింగ్‌ ఆరంభంలోనే డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన సెన్సెక్స్‌ చివరివరకు అదే జోరును కంటిన్యూ చేసింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగిసి చివ‌ర‌కు సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 37,556కు ఎగబాకింది. నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 11,361కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 68.79 వద్ద ముగిసింది. బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి.

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ పరిస్థితులు సద్దుమణగడం, ఆర్‌బీఐ వడ్డీరేట్ల ప్రభావం తగ్గడంతో మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపడంతో ఏర్పడ్డ మంచి వాతావరణంలో సూచీలు దూసుకుపోయాయి. జీఎస్టీ రేటు కోత, త్రైమాసిక ఫలితాలు కూడా లాభాలకు కారణమయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ (14.50%), వీఐపీ ఇండస్ట్రీస్ (8.13%), డెల్టా కార్ప్ (8.05%), కమిన్స్ ఇండియా (7.27%), ట్రైడెంట్ లిమిటెడ్ (7.10%).

టాప్ లూజర్స్:
జెట్ ఎయిర్ వేస్ (-7.00%), నెస్లే (-4.11%), చైన్నై పెట్రోలియం కార్పొరేషన్ (-3.69%), ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (-3.11%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (-3.02%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -