Tuesday, May 14, 2024
- Advertisement -

ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా కాలేజీ మూసేయిస్తానని అసెంబ్లీలో ఆవేశపడ్డావ్‌గా బాబూ?

- Advertisement -

టిడిపి భజన మీడియా విషయం పక్కన పెడితే ఇతర మీడియా సంస్థలన్నీ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బాబు తుంగలో తొక్కాడు అన్న నిజాలనే చెప్తూ ఉన్నాయి. ఓటుకు నోటు దెబ్బకు ప్రత్యేక హోదా లాంటి కేంద్రం నుంచి రావాల్సిన హామీలకు కూడా మంగళం పాడేశాడు అనే రాస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ ఎల్లో మీడియా వాయిస్ ముందు ఇతర మీడియా వాయిస్ జనాల్లోకి వెళ్ళడం చాలా చాలా కష్టమన్న విషయం ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. నిజం గడపదాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది అన్న సామెత ఇక్కడ కరెక్ట్‌గా సూట్ అవుతుంది. ఆ విషయం పక్కన పెడితే ఒక్క ఎన్నికల హామీలు అనే కాదు….చెప్పిన మాట, ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని గొప్ప అనుభవం ఉన్న నేత నారా చంద్రబాబునాయుడు. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఆవేశపడిపోయి మాట్లాడేశాడు చంద్రబాబు. అఫ్కోర్స్ విజయవాడలో టిడిపి నేతల సెక్స్ స్కామ్ బయటపడితే అసలు దోషులను వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా సానుభూతిపరులైన వడ్డీ వ్యాపారస్తులపై దాడులు చేయించి, బెదరగొట్టి వైకాపాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిన రాజకీయం చంద్రబాబు సొంతం. అదీ బాధితులైన విజయవాడ మహిళలకు చంద్రబాబు చేసిన న్యాయం. ఇక అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా వరుసగా ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న నారాయణ కాలేజీల గురించి కనీస ప్రస్తావన కూడా లేదు. ఎందుకంటే 2004 ఎన్నికల్లో బాబుకు స్పాన్సరింగ్ చేసిన నారాయణ ఇప్పుడు చంద్రబాబు ఆంతరంగికుడు మరి. ఇక ఆ నారాయణ వియ్యంకుడే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇక నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాల గురించి ఏం చర్చిస్తారు? అందుకే ఏదో తూతూ మంత్రంగా విద్యార్థుల మరణాల గురించి మాట్లాడారు.

ఆ సందర్భంగా చంద్రబాబు వీరావేశం ప్రదర్శించారు. గొప్పగా ఆవేధన అభినయించారు. అభినయం అని ఎందుకు అనాల్సి వస్తోందో ఈ న్యూస్ చదివాక మీకే అర్థమవుతుంది. ‘ఇంకొక్క విద్యార్థి ఆత్మహత్య చోటుచేసుకున్న ఆ కాలేజీ లైసెన్స్ కేన్సిల్ చేయిస్తా…..మూసేయిస్తా’ అని ఆవేశంగా మాట్లాడేశాడు చంద్రబాబు. నిన్న తిరుపతి నారాయణ కాలేజీలో ఒక బైపిసి సెకండ్ ఇయర్ విద్యార్థి శ్రీ హర్ష ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ కాలేజీ హాస్టల్‌లోనే ఉరివేసుకుని చనిపోయాడు. ఇంతకుముందు కొంతమంది విద్యార్థులు చనిపోయినప్పుడు ప్రేమకథనే కారణమా? ఆర్థిక సమస్యలా? తల్లిదండ్రుల వేధింపులా’ అంటూ అసహ్యంగా వార్తలు ప్రచురించి ఇష్యూ డైవర్ట్ చేసిన ఎల్లో మీడియాకు కూడా ఈ సారి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే శ్రీహర్ష టాప్ క్లాస్ స్టూడెంట్. చదువే లోకంగా బ్రతికిన విద్యార్థి. తోటి విద్యార్థులు నారాయణ కాలేజీ స్టాఫ్‌నే దోషులుగా చెప్తున్నారు. మరి చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చిత్తూరు జిల్లా విద్యార్థినే నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అసెంబ్లీలో చంద్రబాబు ఆవేశం ఏమైంది? ఆగ్రహం ఎక్కడ? నారాయణ కాలేజీని ఎప్పుడు మూసేయిస్తాడో చెప్పడే? అసలు మూసేయిస్తాడా? మూసేయించడా? తన బినామీలాంటి నారాయణకు కొమ్ము కాస్తాడా? లేక నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థి తరపున నిలబడతాడా?

ఈ ప్రశ్నలకు సమాధానం మనందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పండి……చంద్రబాబుది అభినయమా కాదా? ఇక ఇదే సందర్భంలో పవన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చిరంజీవిని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గం…..తిరుపతి సభలోనే పవర్ స్టార్‌గారు చంద్రబాబుకు ఓటెయ్యండి అని గొంతెత్తి అరిచి చెప్పాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఆ గొంతు? అజ్ఙాత వాసి సినిమాకు డబ్బింగ్ చెప్తూ బిజీగా ఉన్నాడా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆ గొంతు ఎప్పటికీ పెగలదా? విద్యార్థుల చావుకేకలు అభినవ భగత్‌సింగ్‌ని అని చెప్పుకుంటున్న పొలిటికల్ స్టార్‌ని కదిలించలేకపోతున్నాయా? ఇంకా ఎంతమంది చనిపోతే నారాయణపై చర్యలు ఉంటాయి?

ఎంతమంది చనిపోయినా ఉండవు. నారాయణ కాలేజీల దారుణాలకు తగిన శిక్ష పడాలంటే మాత్రం ముందు చంద్రబాబును అధికారంలో నుంచి దింపాలి. కాదంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -