Sunday, May 19, 2024
- Advertisement -

జగన్ గ్రీన్ సిగ్నల్.. వైసీపీలోకి టీడీపీ సీనియర్ మాజీ మంత్రి

- Advertisement -
tdp ex minister jump ysrcp

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం ముందు చూస్తే గొయ్యి.. వెనక చూస్తే నోయ్యి అన్నట్లు ఉంది. అధికారంలోకి వచ్చి మూడు ఏళ్లు కావస్తున్న కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకొన్న బాబు కు ఇంటి పోరు ఇప్పుడు తెగ ఇబ్బందిగా మారింది. ఇటివలే జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొంతమందికి భాగంగా కొంతమందికి అనే కోపంతో వారు టీడీపీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇది అంత ఒక ఎత్తు అయితే మరోవైపు దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు.. ప్రస్తుతం బాబు సొంత జిల్లా ఎంపీ శివప్రసాద్ బాబుపై అంతే ఎత్తున ఎగిరిపడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న ఒక సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదు అని గుర్రుగా ఉన్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో లేకపోయిన కానీ పార్టీకి అన్నివిధాలుగా అండగా ఉన్న కానీ నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యలో వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో గాలి తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు అని సమాచారం. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం గురించి ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో మంతనాలు జరిపారట.

ఈ విషయంలో బాబు సర్కారును ఒక ఆట ఆడుకుంటున్న వైసీపీ మహిళ ఎమ్మెల్యే రోజా ఇప్పటికే గాలి ముద్దు కృష్ణమనాయుడుకు పార్టీలో చేరమని.. సీనియర్ నాయకులు కావడంతో పార్టీలో సరైన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారట. దాంతో వైసీపీలోకి చేరడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. అది కాకుండా మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్గంలో నమ్మకస్తుడు అయిన గాలి ను చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పక్కన పెడుతుండటంతో గాలి అనుచరులు కూడా పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో గాలికి ముందు ఆప్షన్ వైసీపీ పార్టీ కనిపిస్తుండటంతో వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారట. అన్ని అనుకున్నట్లు జరిగితే వైసీపీ ప్లీనరీ రోజునే చేరాలని గాలికి వైసీపీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మరి ముప్పై ఏళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గాలి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related

  1. జగన్‌కు నిజంగా మందు తాగుతాడా..? అసలు నిజం ఏంటి..?
  2. చంద్రబాబుకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన జగన్
  3. చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్ళకు చుక్కలు చూపిస్తున్న జగన్
  4. జగన్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -