- Advertisement -

పోలీసునంటూ యువతిపై టీడీపీ నేత దాష్టికం!

- Advertisement -

పోలీసులమంటూ బెదిరించి, ఒంటరిగా ఉన్న ఓ ఫార్మసీ విద్యార్థినిపై తెలుగుదేశం పార్టీ నేత అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఘోర ఉదంతం అనంతపురం నగర పరిధిలో వెలుగుచూసింది. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ముఖ్య అనుచరుడిగా చెలామణి అవుతున్న కొక్కంటి హరి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసుల కథనం ప్రకారం… అనంతపురం నగరానికి చెందిన ఓ యువతి ఫార్మసీ చదువుతోంది. సదరు విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి నగర శివార్లలోని వనమిత్ర పార్కుకు వెళ్లింది. అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని గమనించిన నిందితుడు కొక్కంటి హరి….వారిపై నిఘా పెట్టాడు. అనంతరం యువతీ యువకుల వద్దకు వెళ్లి తాను పోలీస్ అధికారినంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటూ సదరు యువ జంటను కొక్కంటి హరి తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశాడు. కేసు పెడతానంటూ బెదిరిస్తూ…యువతి స్నేహితుడిని పక్కకు నెట్టివేశాడు. ఆపై యువతిపై ఒంటరిగా దాడి చేసి… అత్యాచారానికి యత్నించాడు.

టీడీపీ నేత హరి చేస్తున్న ఘాతుకాన్ని చూసి సదరు యువతి స్నేహితుడు ఎదురుతిరిగాడు. నిందితుడిని గట్టిగా ప్రతిఘటించడంతో పాటు గట్టిగా కేకలు వేస్తూ స్థానికులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించాడు. యువకుడి తిరుగుబాటుతో భయపడిన నిందితుడు కొక్కంటి హరి అక్కడి నుండి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టారు. నిందితుడు ధర్మవరం ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత కొక్కంటి హరిగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, శనివారం రాత్రి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మహిళల రక్షణే ధ్యేయమని ప్రభుత్వం చెబుతున్నా, అధికార పార్టీకి చెందిన నాయకులే ఇలా పోలీసుల ముసుగులో వచ్చి విద్యార్థినులపై దారుణాలకు ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -