Tuesday, May 14, 2024
- Advertisement -

బాబు మీద కోపంగా తెలుగు తమ్ముళ్ళు ?

- Advertisement -

ఏపీ కి కేంద్రం ఇచ్చిన బడ్జెట్ లో మినిమం మంచి కూడా జరగకపోయినా పల్లెత్తు మాట అనద్దు అంటున్నారు చంద్రబాబు గారు. దీనికి తెలుగు తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు.

మొన్న బడ్జెట్ తరవాత జరిగిన పాలిట్ బ్యూరో మీటింగ్ లో బీజేపీ మీద ఒక్కరు కూడా విమర్శలు చెయ్యద్దు అని బాబు స్వయంగా చెప్పడం ఆశ్చర్యకర విషయం. సమావేశానికి నేతలు అందరూ వీర ఆవేశంతో ఊగిపోయి ఒచ్చారు కానీ దాన్ని చంద్రబాబు గారు గాలి తీసేసినట్టు లైట్ తీసుకోమనడం విశేషం. రాష్ట్ర విభజన నేపధ్యం లో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నవ్యాంధ్ర రాష్ట్రాన్ని పొరుగు దేశాలతో అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు సాగాలి అంటే ఆయనకీ కేంద్రం నుంచి భారీ నిధులు ఎంతయినా అవసరం కానీ కేంద్రం మినిమం కూడా కేర్ చెయ్యడం లేదు ఏపీ ని. 

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం తో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ లాంటివి ఎంతైనా అవసరం. ఇంత జరిగినా బీజేపీ ని ఏమీ అనద్దు అనడం ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళకి చిర్రెత్తుకుని ఒస్తున్న విషయం. ఇంత జరిగినా.. బీజేపీనీ ఒక్కమాట కూడా అనొద్దట! బీజేపీతో స్నేహం కొనసాగుతుంది. మరోసారి ప్రయత్నిద్దాం. ఇంతకన్నా చేయాల్సిందేమీలేదన్న చంద్రబాబు మాటలకు పార్టీకి చెందిన ముఖ్య నేతలకు దిమ్మతిరిగిపోయింది. తెలంగాణతోపాటు, ఏపీకి తగిని కేటాయింపులు లేవంటూ టీటీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బాబు కేంద్రం మీద చిన్న విమర్శ కూడా చెయ్యకుండా గులము అందాం అనడం తెలుగు తమ్ముళ్ళకి ఏ మాత్రం నచ్చడం లేదట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -