Thursday, May 16, 2024
- Advertisement -

రూ. 1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్ హైలైట్స్..

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ,82 ,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రాష్ర్టం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేళ్లలో అద్భుత విజయాలు సాధించామ‌న్నారు. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. 2018-19లో తలసరి ఆదాయం రూ. 2.06 లక్షలకు చేరుకుందని చెప్పారు.

: బడ్జెట్ – రూ. 1,82,017 కోట్లు
: రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు
: మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు
: రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు
: ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు (అంచనా)
: 2018-19 ఆర్థిక వృద్ధి రేటు 10.6శాతం
: కల్యాణలక్ష్మి, షాది ముబారక్ కోసం రూ. 1,450 కోట్లు
: రైతు రుణమాఫీకి రూ. 6,000 కోట్లు
: ఆసరా పింఛన్లకు రూ. 12,067 కోట్లు
: మిషన్ కాకతీయకు రూ. 22,500 కోట్లు
: మైనార్టీల సంక్షేమానికి రూ. 2,004 కోట్లు
: పీడీఎస్ బియ్యం సబ్సిడీకి రూ. 2,744 కోట్లు
: రైతు భీమాకు రూ. 650 కోట్లు
: నిరుద్యోగ భృతికి రూ. 1,810 కోట్లు
: ఎంబీసీ కార్పొరేషన్ కు రూ. 1,000 కోట్లు
: షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి రూ. 9,827 కోట్లు
: షెడ్యూల్ కులాల ప్రగతి నిధికి రూ. 16,581 కోట్లు
: వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు
: నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు
: ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు
: డిసెంబర్ 11, 2018లోపు తీసుకున్న లక్షలోపు వ్యవసాయ రుణాల మాఫీ
: పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి రూ. 3,256 కోట్లు
: ఒక్కో మనిషికి రూ. 1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు
: 500 జనాభా కలిగిన గ్రామానికి రూ. 8 లక్షల నిధులు
: టీఎస్ఐపాస్ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు
: పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయి
: ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -