Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ బాటలోనే కేసీఆర్..!

- Advertisement -

ఏపీ సీఎం జగన్ బాటలోనే నడుస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్…ఇవాళ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రధానంగా పెన్షన్, బీమా వంటివి ఉన్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అందిస్తున్న పెన్షన్‌ను రూ.2016 నుండి 5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పింఛన్లను ఏడాదికి రూ.500 పెంచుతూ 5వ ఏడాది వచ్చే సరికి 5000 వేలు అందిస్తామని ప్రకటించారు.

ఏపీలో వైఎస్ జగన్‌…పెన్షన్ ను రూ.2000 నుంచి ప్రతి ఏడాది రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000 చేసి అక్కడ విజయవంతంగా కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు కేసీఆర్. ఏపీ బాటలోనే రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా తెలంగాణలో సైతం ప్రతి ఏడాది కొంతమేర పింఛన్ సాయాన్ని పెంచుకుంటూ పోతామని స్పష్టం చేశారు.పెన్షన్ ను ఒకేసారి రూ.5 వేలకు పెంచుతామని ప్రజలను తాము మోసం చేయడం లేదని చెప్పుకొచ్చారు.

ప్రజలందరికీ ఐదు లక్షల కేసీఆర్ బీమా కల్పిస్తామని ….తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం ఇస్తాం అన్నారు. రైతు బంధు సాయాన్ని ఏడాది ఏడాదికి పెంచుకుంటూ పోయి ఎకరాకు రూ.16 వేలు అందిస్తామని చెప్పారు. నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్‌, సౌభాగ్య లక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు మూడు వేల భృతి ఇస్తామని ప్రకటించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -